News February 11, 2025
మద్యం బాటిల్‌పై రూ.10 పెంపు: కమిషనర్

AP: మద్యం ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ స్పందించారు. బ్రాండ్, సైజుతో సంబంధం లేకుండా బాటిల్‌పై రూ.10 పెంచినట్లు తెలిపారు. రూ.15, రూ.20 పెరిగినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. రూ.99 మద్యం బాటిల్, బీర్ల ధరల్లో మార్పులు లేవని వెల్లడించారు. అన్ని బ్రాండ్ల ధరలను షాపుల్లో కచ్చితంగా ప్రదర్శించాలని యజమానులను ఆదేశించారు.
Similar News
News December 8, 2025
సమ్మిట్ గెస్టుల కోసం తెలంగాణ చిరుతిళ్లు

TG: ఈరోజు, రేపు జరగనున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే అతిథుల కోసం తెలంగాణ స్పెషల్ వంటకాలు సిద్ధం చేస్తున్నారు. చిరుతిళ్లతో కూడిన ప్రత్యేక డైట్ కిట్‌ను వారికి అందజేయనున్నారు. అందులో సకినాలు, నువ్వుల లడ్డూ, గారెలు, ఇప్పపువ్వు లడ్డూ, మక్క పేలాలు ఉన్నాయి. ఇక లంచ్‌లో హైదరాబాద్ దమ్ బిర్యానీ, పాయా, మటన్ కర్రీ, విదేశీ ప్రతినిధుల కోసం ఆయా దేశాల వంటలను రెడీ చేస్తున్నారు.
News December 8, 2025
వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు

RBI <<18475069>>రెపో రేటును<<>> 0.25% మేర తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.25% తగ్గించాయి. రెపో అనుసంధానిత రుణ రేటును PNB 8.35 నుంచి 8.10%కి, BOB 8.15 నుంచి 7.90%కి, BOI 8.35 నుంచి 8.10%కి సవరించాయి. హోం లోన్ రేట్లు 7.10%, కార్ లోన్ రేట్లు 7.45% నుంచి ప్రారంభమవుతాయని BOM తెలిపింది.
News December 8, 2025
ముడతలు తగ్గించే ఫేస్ ప్యాక్

యవ్వనంగా కనిపించే చర్మం కోసం రసాయన ఉత్పత్తులకు బదులు ఇంట్లోని సహజ పదార్థాలను వాడితే చాలు. వాటిల్లో ఒకటే ఈ అరటిపండు ఫేస్ ప్యాక్. బాగా మగ్గిన అరటిపండును తీసుకొని కాస్త తేనె, బార్లీ పౌడర్ కలిపి పేస్ట్ చేయాలి. బార్లీకి బదులు బియ్యప్పిండి కూడా వాడొచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి అరగంట ఉంచిన తర్వాత కడిగేయాలి. వారానికోసారి ఈ ప్యాక్ వేస్తే చర్మం యవ్వనంగా మారుతుంది.


