News August 3, 2024
అనాథ బాలికకు రూ.10లక్షల సాయం: సీఎం చంద్రబాబు

AP: నంద్యాల(D) చిన్నవంగలిలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గురుశేఖర్, అతని భార్య, ఇద్దరు కూతుళ్లు మృతిచెందగా, మరో కూతురు ప్రసన్న(15) అనాథగా మిగిలింది. ఆమెకు రూ.10లక్షల సాయం ప్రకటించిన సీఎం, ఆమెను సంరక్షిస్తున్న నానమ్మకు రూ.2లక్షలు అందిస్తామన్నారు. బాలిక సంరక్షణ, విద్య విషయంలో అండగా ఉంటామన్నారు.
Similar News
News January 29, 2026
ఏకాదశి ఉపవాసం ఉంటూ పఠించాల్సిన మంత్రాలివే..

* ఏకాదశి రోజు ప్రదోష వేళలో ఈ శ్లోకాన్ని పఠించాలి.
ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహం అపపే హని|
భోక్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత||
* ఉపవాసం విరమించే సమయంలో(ద్వాదశి) పఠించాలి.
అజ్ఞాన తిమిరాంధస్య వ్రతేనానేన కేశవ|
ప్రసీద సుముఖోనాధ జ్ఞాన దృష్టి వ్రతోభవ||
వీటితో పాటు ‘విష్ణు సహస్రనామ స్తోత్రం’ పఠించడం శ్రేష్టం. ‘ఓం నమో నారాయణాయ’ అష్టాక్షరి మంత్రం, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపించాలి.
News January 29, 2026
మరింత పెరగనున్న చలి

APలోని కోస్తా, రాయలసీమలో చలి మరింత పెరుగుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1-2 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. ఇవాళ మన్యం, అల్లూరి, ఏలూరు, ప.గో, ఎన్టీఆర్, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో పొగమంచు కురుస్తుందని వెల్లడించింది. అటు TGలోనూ పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. FEB 2 వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది.
News January 29, 2026
RO-KO కోసం రూల్స్ మారనున్నాయ్!

విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్, కోహ్లీ ఆడిన మ్యాచులు ప్రసారం కాకపోవడంపై విమర్శలు వచ్చాయి. అవి లైవ్ టెలికాస్ట్ కాకపోవడానికి కారణం 100 దేశవాళీ మ్యాచులు మాత్రమే లైవ్ చేసేలా టెలివిజన్ సంస్థతో BCCIకి ఒప్పందం ఉంది. ఇప్పుడు దాన్నే మార్చనున్నట్లు, 100కు మించి మ్యాచులు ప్రసారం చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. స్టార్ ప్లేయర్స్ ఆడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నారు.


