News August 3, 2024

అనాథ బాలికకు రూ.10లక్షల సాయం: సీఎం చంద్రబాబు

image

AP: నంద్యాల(D) చిన్నవంగలిలో మ‌ట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో న‌లుగురు చనిపోయిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గురుశేఖర్, అతని భార్య, ఇద్దరు కూతుళ్లు మృతిచెందగా, మరో కూతురు ప్రసన్న(15) అనాథగా మిగిలింది. ఆమెకు రూ.10లక్షల సాయం ప్రకటించిన సీఎం, ఆమెను సంరక్షిస్తున్న నానమ్మకు రూ.2లక్షలు అందిస్తామన్నారు. బాలిక సంరక్షణ, విద్య విషయంలో అండగా ఉంటామన్నారు.

Similar News

News September 19, 2024

జానీ మాస్టర్ ఘటనపై స్పందించిన మనోజ్

image

జానీ మాస్టర్ కేసుపై హీరో మంచు మనోజ్ స్పందించారు. ‘ఈ స్థాయికి వచ్చేందుకు ఆయన ఎంతగా శ్రమించారో అందరికీ తెలుసు. ఆయనపై ఆరోపణలు చూస్తుంటే నా గుండె ముక్కలవుతోంది. తప్పు ఎవరిది అనేది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం భావి తరాలకు ప్రమాదకర మెసేజ్ ఇస్తోంది. త్వరగా స్పందించిన HYD పోలీసులకు అభినందనలు. మాస్టర్ తప్పు చేయకపోతే పోరాడండి. దోషి అయితే అంగీకరించండి’ అని మనోజ్ సూచించారు.

News September 19, 2024

సంక్రాంతికి స్పెషల్ ట్రైన్లు ఎన్నంటే?

image

సంక్రాంతికి 400 ప్రత్యేక రైళ్లను నడిపే యోచనలో రైల్వే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనవరి 11, 12, 13 తేదీల్లో రెగ్యులర్ రైళ్ల టికెట్లన్నీ అమ్ముడవ్వగా వెయిటింగ్ లిస్ట్ కూడా పెరిగిపోయింది. ఈ వెయిటింగ్ లిస్ట్‌ను ఫిల్ చేసేందుకు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రద్దీని బట్టి పలు మార్గాల్లో స్పెషల్ ట్రైన్లు నడపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

News September 19, 2024

జమిలి ఎన్నికలను వ్యతిరేకించిన CPI(M)

image

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జమిలి ఎన్నిక(ఒకే దేశం. ఒకే ఎన్నిక)ను వ్యతిరేకిస్తున్నట్లు CPI(M) ప్రకటించింది. ఇది BJP-RSS ఆలోచన అని ఆరోపించింది. ఈ జమిలి ఎన్నిక అమలైతే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బ తింటుందని అభిప్రాయపడింది. దీనివల్ల పలు రాష్ట్రాల్లో మధ్యంతర ఎన్నికలు వస్తాయని, ఫలితంగా ప్రజల ఓటు హక్కుకు విలువలేకుండా పోతుందని పేర్కొంది. కేంద్రం ఈ జమిలి ఎన్నికలకు నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.