News July 17, 2024

ఏపీకి రూ.1000 కోట్లు ఇవ్వాలి: మంత్రి సత్యకుమార్

image

AP: నేషనల్ హెల్త్ మిషన్ కింద ప్రత్యేకంగా రాష్ట్రానికి రూ.1000 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రుల్ని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోగ్య మందిర్ భవనాల నిర్మాణానికి నిధులివ్వాలని కోరినట్లు చెప్పారు. 40 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కేంద్ర మంత్రులు తమను ఆరా తీసినట్లు పేర్కొన్నారు.

Similar News

News December 4, 2025

పవన్ కళ్యాణ్‌కు మంత్రి ఆనం సూచన ఇదే..!

image

ఆత్మకూరు అభివృద్ధికి తాను ఏమి అడిగినా అన్ని ఇచ్చారని Dy.CM పవన్ కళ్యాణ్‌ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొనియాడారు. ఆత్మకూరులో కొత్త DDO ఆఫీస్‌ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు. ‘ఒకేసారి 77ఆఫీసులు ప్రారంభించడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం పాత భవనాల్లో DDO ఆఫీసులు పెట్టారు. ఒకే మోడల్‌తో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బిల్డింగ్‌లు కట్టించండి’ అని ఆనం కోరగా ఆలోచన చేస్తామని పవన్ చెప్పారు.

News December 4, 2025

179 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇంపాల్‌లో 179 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PhD, పీజీ, NET ఉత్తీర్ణతతో పాటు బోధన/ రీసెర్చ్‌లో అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.57,700 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PWBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://cau.ac.in/

News December 4, 2025

దీపం కొండెక్కింది అని ఎందుకు అంటారు?

image

దీపం ఆరిపోవడాన్ని మనం ‘దీపం కొండెక్కింది’ అని అంటాం. దీని వెనుక ఓ ఆధ్యాత్మిక కారణం ఉంది. సాధారణంగా మనం పర్వతాలను దైవ నివాసాలుగా భావిస్తాం. కొండలు దేవతలకు ఆశ్రయం ఇస్తాయని నమ్ముతాం. అయితే, దీపం జ్యోతి ఆరిపోయినప్పుడు, అది భౌతిక దేహాన్ని విడిచి, నేరుగా దైవంలో కలిసిపోయింది అని భావించాలి. దీపం దైవంలో ఐక్యమైందని చెప్పడానికే మనం ఆధ్యాత్మిక వ్యక్తీకరణను ఉపయోగిస్తూ ఇలా చెబుతుంటాం.