News July 17, 2024
ఏపీకి రూ.1000 కోట్లు ఇవ్వాలి: మంత్రి సత్యకుమార్
AP: నేషనల్ హెల్త్ మిషన్ కింద ప్రత్యేకంగా రాష్ట్రానికి రూ.1000 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రుల్ని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోగ్య మందిర్ భవనాల నిర్మాణానికి నిధులివ్వాలని కోరినట్లు చెప్పారు. 40 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కేంద్ర మంత్రులు తమను ఆరా తీసినట్లు పేర్కొన్నారు.
Similar News
News December 10, 2024
శబరిమల వెళ్లే మహిళలకు గుడ్‌న్యూస్
శబరిమల వెళ్లే మహిళల భద్రత పట్ల కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంబా బేస్‌లో ప్రత్యేక వసతి సదుపాయాన్ని కల్పించింది. ఈ వసతి గృహంలో 50మంది మహిళలు విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేసి సోమవారం ప్రారంభించింది. అయ్యప్ప మాలధారులతో వచ్చే మహిళలు తమవారు తిరిగొచ్చే వరకు పంపా బేస్, హిల్ టాప్ వద్ద వాహనాల్లోనే ఎదురు చూడాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో మహిళలకు ఆ కష్టాలు తీరనున్నాయి.
News December 10, 2024
మీడియా సంస్థలపై జగన్ రూ.100 కోట్ల పరువు నష్టం దావా
AP: సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో తనపై అవాస్తవాలు ప్రచురించాయంటూ పలు మీడియా సంస్థలపై రూ.100 కోట్లకు మాజీ సీఎం జగన్ పరువు నష్టం దావా వేశారు. వెంటనే ఆ కథనాలు తొలగించి బేషరతుగా క్షమాపణ చెప్పేలా ఆదేశించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయమూర్తి ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు నోటీసులిచ్చారు. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు.
News December 10, 2024
మంత్రివర్గంలోకి నాగబాబు.. అంబటి సెటైర్
AP: నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ‘ప్రభుత్వం అంటే మల్టీ స్టారర్ మూవీ అనుకుంటున్నారు.. పాపం’ అని Xలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, నాగబాబును ట్యాగ్ చేశారు.