News August 11, 2024

రూ.1,00,000 సాయం.. రేపే లాస్ట్ ఛాన్స్

image

TG: రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం దరఖాస్తు గడువు ఆగస్టు 12వ తేదీ సా.5 గంటలతో ముగియనుంది. రాష్ట్రానికి చెందిన యువత సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధిస్తే ఈ స్కీం కింద రూ.లక్ష సాయాన్ని సింగరేణి తరఫున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. గత నెల 20వ తేదీన CM రేవంత్, డిప్యూటీ CM విక్రమార్క ప్రారంభించారు. గతంలో విధించిన దరఖాస్తు గడువు ఈ నెల 6తో ముగియగా, అభ్యర్థుల విజ్ఞప్తితో 12 వరకు పొడిగించారు.

Similar News

News September 15, 2024

రేవంత్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు: హరీశ్

image

TG: అరెకపూడి గాంధీ కాంగ్రెస్ MLA అని CM రేవంత్ ఇవాళ తన వ్యాఖ్యలతో ఒప్పుకున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘మనోళ్లే వాళ్లింటికి వెళ్లి తన్నారని రేవంత్ అన్నారు. అంటే గాంధీ వాళ్లోడే అన్నట్టుగా. సీఎం మాటలు చూస్తుంటే తానే దాడి చేయించానని చెప్పకనే చెబుతున్నట్లు ఉన్నాయి. మళ్లీ పైనుంచి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు’ అని హరీశ్ ఎద్దేవా చేశారు.

News September 15, 2024

నిఫా వైరస్‌తో కేరళలో వ్యక్తి మృతి

image

నిఫా వైరస్ కారణంగా కేరళలో ఓ వ్యక్తి మరణించారు. మళప్పురం జిల్లాకు చెందిన 24 ఏళ్ల వ్యక్తి చనిపోయినట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. బెంగళూరు నుంచి రాష్ట్రానికి వచ్చిన ఆ వ్యక్తి సెప్టెంబర్ 9వ తేదీన మృతి చెందినట్లు పేర్కొన్నారు. మరణం తర్వాత పరీక్షల్లో నిఫా వైరస్ ఉన్నట్లు తేలిందని చెప్పారు. మృతుడితో కాంటాక్ట్‌లో ఉన్నవాళ్లని గుర్తించి అనుమానిత లక్షణాలు ఉన్న ఐదుగురిని ఐసోలేషన్‌లో ఉంచామన్నారు.

News September 15, 2024

అల్లు అర్జున్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి గిఫ్ట్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఓ బహుమతి పంపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని బన్నీ వెల్లడించారు. ‘ఎవరో తెలీదు కానీ నాకు ఈ పుస్తకాన్ని గిఫ్ట్‌గా పంపించారు. అతడి నిజాయితీ నా హృదయాన్ని తాకింది. నాకు పుస్తకాలంటే ఇష్టం. ఇక ఈ బుక్ రాసిన సీకే ఒబెరాన్‌కు ఆల్‌ ది బెస్ట్’ అని ఇన్‌స్టా స్టోరీ పెట్టారు. దీంతో ఆ అభిమాని ఎవరా అంటూ ఆయన ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.