News December 28, 2024
నవంబర్‌లో శ్రీవారి హుండీకి రూ.111.3 కోట్లు

AP: నవంబర్ నెలలో తిరుమల శ్రీవారిని 20.35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో హుండీ కానుకలు రూ.111.3 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. 7.31 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు చెప్పారు. నెల రోజుల్లో 97.01 లక్షల లడ్డూలు విక్రయించగా 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించినట్లు పేర్కొన్నారు.
Similar News
News April 11, 2026
ములుగు: ‘మన ఇసుక వాహనం’తో అక్రమ రవాణాకు చెక్!

జిల్లాలో ప్రవేశపెట్టిన ‘మన ఇసుక వాహనం’తో అక్రమ ఇసుక రవాణాకు చెక్ పడనుంది. కొందరు వ్యక్తులు ఇష్టానుసారంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంపు చేసి పట్టణాలకు తరలిస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ ప్రత్యేక చొరవతో ‘ఇసుక వాహనం’ అమల్లోకి తెచ్చారు. మీ సేవలో అవసరమున్న వ్యక్తులు స్లాట్ బుక్ చేసుకొని ఇసుక పొందాల్సి ఉంటుంది. ప్రతి వినియోగదారుడి వివరాలు స్థానిక కార్యదర్శి పరిశీలించి సప్లై చేస్తారు.
News April 11, 2026
సేంద్రియ ఎరువులు.. సాగులో వాటి ప్రాధాన్యత

పంటలు, మొక్కలు ఏపుగా పెరగాలంటే ఎరువులు అవసరం. ఇవి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందించి మంచి దిగుబడిని అందిస్తాయి. రసాయన ఎరువులతో కొన్ని దుష్పరిణామాలు ఉన్నందున ప్రస్తుతం చాలా మంది రైతులు సేంద్రియ ఎరువులను వాడుతున్నారు. ఈ ఎరువులను మొక్కలు, జంతువుల వ్యర్థాలు, విసర్జితాల నుంచి తయారుచేస్తారు. సమగ్ర ఎరువుల వాడకంలో సేంద్రియ ఎరువులు ఒక భాగం. రైతులు వీటిని వ్యవసాయంలో తప్పక వాడితే సాగు వ్యయం తగ్గుతుంది.
News April 11, 2026
వాట్సాప్‌లోనే రిజిస్ట్రేషన్ సర్వీసులు

TG: స్థిరాస్తులు, భూములకు సంబంధించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సేవలను వాట్సాప్ ద్వారా పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. 8096958096 నంబర్‌కు Hi అని మెసేజ్ చేయాలి. కావాల్సిన సర్వీసు ఎంచుకొని వివరాలు నమోదు చేసి, ఫాం నింపాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ పేమెంట్ చేసి సర్వీసులు పొందవచ్చు. సబ్ రిజిస్ట్రార్ ఆమోదం తర్వాత సర్టిఫైడ్ EC కాపీ నేరుగా వాట్సాప్‌లోనే అందుతుంది.
Share It


