News August 18, 2024
పండక్కి రూ.12 వేల కోట్ల వ్యాపారం!
రాఖీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా మార్కెట్లు రద్దీగా ఉన్నాయని, రూ.12 వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేస్తోంది. ప్రజలు స్వదేశీ వస్తువులతో ఈ పర్వదినాన్ని జరుపుకోవాలని ట్రేడ్ బాడీ కోరింది. దేశీయంగా తయారైన రాఖీలు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. గత ఏడాది రూ.10 వేలకోట్ల వ్యాపారం జరిగింది.
Similar News
News September 15, 2024
SEP 17ని విమోచన దినోత్సవంగా నిర్వహించండి: బండి
TG: సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా కాకుండా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. కేంద్రం కూడా అదే పేరుతో నిర్వహిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వాలు విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారి చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. అప్పటి రజాకర్లే దళమే..ప్రస్తుతం MIM పార్టీగా అవతరించిందన్నారు.
News September 15, 2024
వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు?
ఇప్పుడైతే వినాయకులను POPతో చేస్తున్నారుగానీ ఒకప్పుడు చెరువులోని స్వచ్ఛమైన ఒండ్రుమట్టితోనే తయారుచేసేవారు. లంబోదరుడిని పూజించే 21రకాల పత్రిల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ప్రవహించే నదులు, వాగులతో పాటు చెరువుల్లోని నీరు సర్పాలు ఇతర కీటకాలతో విషపూరితమవుతాయి. ఒండ్రుమట్టి వినాయకులను నిమజ్జనం చేసి, పత్రిలను వాటిలో వదిలితే నీరు శుద్ధి అవడంతో పాటు ఔషధగుణాలు కలగలుస్తాయని పండితులు చెబుతున్నారు.
News September 15, 2024
ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం.. 600 ప్రత్యేక బస్సులు
TG: ఎల్లుండి వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా HYDలోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు 600 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. GHMC పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15-30 బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సదుపాయాన్ని వినియోగించుకొని నిమజ్జనోత్సవంలో పాల్గొనాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.