News February 5, 2025
కనిపించని కళాఖండానికి రూ.15లక్షలు!

కంటికి అద్భుతంగా కనిపించే కళాఖండాన్ని రూ.కోట్లు పెట్టి కొనుగోలు చేయడం చూస్తుంటాం. కానీ, అసలు భౌతికంగా లేని ఓ ఆర్ట్‌ను $18,300 (రూ.15లక్షలు)కు కొనుగోలు చేశారు. ఇటాలియన్ కళాకారుడు సాల్వటోర్ గరౌ భౌతికంగా కనిపించని శిల్పాన్ని రూపొందించారు. అయితే ఇది భౌతికంగా కనిపించనప్పటికీ అక్కడ ఏదో రూపం ఉందనే భావనే కలుగుతోందని చెప్పుకొచ్చారు. దీనిని విక్రయించేందుకు వేలం నిర్వహించగా భారీ డిమాండ్ కనిపించింది.
Similar News
News March 26, 2026
ఫుట్‌బాల్ టీంకు ఏడుగురు జిల్లా పోలీసుల ప్రాతినిధ్యం

తెలంగాణలో జరగనున్న 74వ బీఎన్ ముల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్-2026 పోటీలకు ఏపీ పోలీస్ జట్టుకు జిల్లాకు చెందిన ఏడుగురు పోలీసులు ప్రాతినిధ్యం వహించారు. ఎన్. నాగేంద్ర (డీఏఆర్), కె. బాబు (జీపీఆర్), బి.సిద్దారెడ్డి (డీఏఆర్), ఎస్.ఇమామ్ ఖాసిం (ఆర్ ఎస్ఐ) తిరుపతి (ఎర్రగుంట్ల), ఎల్.సతీష్బాబు (ట్రాఫిక్, కడప), జి.రాజశేఖర్ (డి.ఎ.ఆర్), ఎస్.శివ సుబ్రమణ్యం (డి.ఎ.ఆర్) ఉన్నారు.
News March 26, 2026
ఇళ్లు, ఆలయాల్లో ఎంత బంగారం ఉందో తెలుసా?

దేశంలోని ఆలయాలు, ఇళ్లలో దాదాపు 50వేల టన్నుల గోల్డ్ ఉంటుందని పార్లమెంటరీ ఆర్థిక స్థాయీ సంఘం సభ్యుడు PP చౌదరి వెల్లడించారు. దీనివిలువ ₹942L Crగా అంచనా వేశారు. దీని ఫైనాన్షియలైజేషన్‌ను మరింత పెంచితే బులియన్ దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించవచ్చన్నారు. కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడిని తగ్గించవచ్చని చెప్పారు. కానీ గోల్డ్‌ను మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఉపయోగించుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
News March 26, 2026
ప్రదోషాల గురించి మీకు ఇవి తెలుసా?

తెలుగు పంచాంగం ప్రకారం.. ప్రతి పక్షంలో వచ్చే త్రయోదశి తిథిని ప్రదోషం అంటారు. ఆ తిథి ఏ వారంలో వస్తుందో దాన్ని బట్టి ఆ ప్రదోషానికి ప్రత్యేక నామం ఉంటుంది.
త్రయోదశి తిథి ఆదివారం వస్తే రవి ప్రదోషం. సోమవారం వస్తే దాన్ని సోమ ప్రదోషం. మంగళవారం వస్తే భౌమ ప్రదోషం. బుధవారం వస్తే బుధ ప్రదోషం. గురువారం వస్తే గురు ప్రదోషం. శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషం. శనివారం వస్తే శని త్రయోదశి అని పిలుస్తారు.


