News February 5, 2025

కనిపించని కళాఖండానికి రూ.15లక్షలు!

image

కంటికి అద్భుతంగా కనిపించే కళాఖండాన్ని రూ.కోట్లు పెట్టి కొనుగోలు చేయడం చూస్తుంటాం. కానీ, అసలు భౌతికంగా లేని ఓ ఆర్ట్‌ను $18,300 (రూ.15లక్షలు)కు కొనుగోలు చేశారు. ఇటాలియన్ కళాకారుడు సాల్వటోర్ గరౌ భౌతికంగా కనిపించని శిల్పాన్ని రూపొందించారు. అయితే ఇది భౌతికంగా కనిపించనప్పటికీ అక్కడ ఏదో రూపం ఉందనే భావనే కలుగుతోందని చెప్పుకొచ్చారు. దీనిని విక్రయించేందుకు వేలం నిర్వహించగా భారీ డిమాండ్ కనిపించింది.

Similar News

News January 19, 2026

ఏ చర్మానికి ఏ ఫేస్‌వాష్ వాడాలంటే..

image

ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ఫేస్‌వాష్‌లు ఉన్నాయి. వీటిల్లో మీ చర్మానికి సరిపోయేదాన్ని ఎంచుకోవాలి. హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్, నియాసినమైడ్ కలిగి ఉన్న ఫేస్‌వాష్‌లు చర్మానికి మేలు చేస్తాయి. ఇవి ముఖానికి తేమను అందించి పొడిదనాన్ని తగ్గిస్తాయి. ఆయిలీ స్కిన్ ఉన్నవారు సాలిసిలిక్ యాసిడ్ లేదా టీ ట్రీ ఆయిల్ కలిగిన ఫేస్‌వాష్, డ్రై స్కిన్ ఉన్నవారు ఆల్మండ్, ఆలీవ్ ఆయిల్ ఉన్న ఫేస్‌వాష్ ఉపయోగిస్తే మంచిది.

News January 19, 2026

జీడీపీ వృద్ధి 7.3 శాతం: మూడీస్

image

ఈ ఏడాది భారత్ GDP వృద్ధి 7.3%కి చేరుతుందని ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ అంచనా వేసింది. అదే విధంగా కుటుంబ ఆదాయాలు పెరిగి బీమా రంగానికి మంచి డిమాండ్ ఏర్పడుతుందని తెలిపింది. బీమా సంస్థల ప్రీమియం మరింత పెరుగుతుందని పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బీమా ప్రీమియం ఆదాయం గణనీయంగా పెరిగి, లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగాలు కీలకంగా నిలిచాయని స్పష్టం చేసింది.

News January 19, 2026

పీసీ ఘోష్‌ కమిషన్‌ కాళేశ్వరం రిపోర్టుపై హైకోర్టులో విచారణ

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై PC ఘోష్ కమిషన్ నివేదికపై KCR, హరీశ్, స్మితా సబర్వాల్, SK జోషి దాఖలు చేసిన పిటిషన్లను HC విచారించింది. కేసీఆర్‌, హరీశ్ తరఫున అడ్వకేట్‌ సుందరం వాదనలు వినిపించారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై పిటిషనర్లు రిప్లై ఫైల్‌ చేశారు. దీనిపై ప్రభుత్వం రిప్లై ఇవ్వడానికి టైమ్ కావాలని AG కోరారు. FEB 20లోపు లిఖితపూర్వకంగా ఇవ్వాలంటూ తదుపరి విచారణను ఫిబ్రవరి 25కు కోర్టు వాయిదా వేసింది.