News August 20, 2025

మేడారం జాతరకు రూ.150 కోట్లు విడుదల

image

TG: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర జరగనుంది.

Similar News

News August 20, 2025

సౌదీలో స్కై స్టేడియం

image

FIFA వరల్డ్ కప్-2034 వేళ సౌదీ అరేబియా వినూత్న స్టేడియాన్ని నిర్మించనుంది. సౌదీ నిర్మించబోయే స్మార్ట్ సిటీలో ఇది ఏర్పాటుకానుంది. ది లైన్ అనే స్మార్ట్ సిటీలో ఎడారి తలానికి 350M ఎత్తులో నిర్మించనున్నారు. 46వేల మంది ప్రేక్షకులు కూర్చొనేలా దీనిని రూపొందించనున్నారు. ఇందుకు $1 బిలియన్‌ను ఖర్చు చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. 2027లో ప్రారంభించి 2032 నాటికి అందుబాటులోకి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

News August 20, 2025

కేబుల్, ఇంటర్నెట్ వైర్ల తొలగింపునకు బ్రేక్!

image

HYDలో కరెంట్ స్తంభాలపై ఉన్న కేబుల్, ఇంటర్నెట్ వైర్లను ప్రభుత్వం <<17454341>>తొలగిస్తున్న<<>> విషయం తెలిసిందే. దీనిపై కేబుల్ ఆపరేటర్లు TG SPDCL CMDతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కేబుల్, ఇంటర్నెట్ వైర్లను కట్ చేయొద్దని TG SPDCL నిర్ణయం తీసుకున్నట్లు ఆపరేటర్లు తెలిపారు. నిరుపయోగంగా ఉన్న వైర్లను తొలగించాలని, రన్నింగ్‌లో ఉన్న కేబుల్, ఇంటర్నెట్ వైర్లను ఒకే బంచింగ్ విధానంలో తీసుకురావాలని CMD సూచించారని పేర్కొన్నారు.

News August 20, 2025

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీతో మోక్షజ్ఞ ఎంట్రీ: నారా రోహిత్

image

నందమూరి వారసుడు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ అతి త్వరలో ఉంటుందని హీరో నారా రోహిత్ తెలిపారు. ఇండస్ట్రీలోకి వచ్చేందుకు అతడు ఆసక్తిగా ఉన్నాడన్నారు. ‘ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ కోసం వెతుకుతున్నట్లు మోక్షజ్ఞ చెప్పాడు. అలాంటి కథ ఉంటే ఈ ఏడాదిలోనే ఎంట్రీ ఉండొచ్చు. మూవీల కోసమే తన లుక్ మొత్తం మార్చేసుకున్నాడు’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అటు బాలయ్యతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని రోహిత్ చెప్పారు.