News November 12, 2024
మహిళలకు నెలకు రూ.1500.. బడ్జెట్‌లో నిధులు

AP: సూపర్‌సిక్స్ పథకాల అమల్లో భాగంగా మరో హామీకి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. 19 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు రూ.1500 అందించే ఆడబిడ్డ నిధికి బడ్జెట్‌లో రూ.3341.82 కోట్లు కేటాయించింది. జెండర్ బడ్జెట్‌లో ఈ నిధుల్ని ప్రభుత్వం చూపించగా.. త్వరలోనే పథకం విధివిధానాలను ప్రకటించే అవకాశం ఉంది.
Similar News
News March 11, 2026
HEADLINES

* గల్ఫ్ యుద్ధంతో దేశంలో గ్యాస్ కొరత!
* కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేతతో మూతపడుతున్న హోటళ్లు
* LPG ఉత్పత్తి 10% పెంచాం: కేంద్రం
* ఈ నెల 13న PM కిసాన్ నిధుల విడుదల
* అంతర్జాతీయ స్థాయి క్రీడలకు అమరావతి సిద్ధం: CBN
* 2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు: TG ప్రభుత్వం
* పెరిగిన బంగారం, వెండి ధరలు
* దాడులు తీవ్రం చేస్తామన్న US.. వెనక్కి తగ్గేదే లేదన్న ఇరాన్
News March 11, 2026
ఆపరేషన్ హార్ముజ్.. రంగంలోకి ఇండియన్ నేవీ?

హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారతీయ నౌకలను సేఫ్‌గా తీసుకురావడానికి నేవీని పంపాలని కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో తమ వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ జలసంధిని దాటలేక ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో 1,100 మందికిపైగా సెయిలర్స్ ఉన్న 38 భారతీయ వాణిజ్య నౌకలు చిక్కుకున్నాయి.
News March 11, 2026
వచ్చే నెలలో Xలో పేమెంట్ ఆప్షన్?

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో త్వరలో ఫోన్ పే, గూగుల్ పే తరహాలో పేమెంట్ ఆప్షన్స్ రానున్నాయి. వచ్చే నెలలో పరిమిత యూజర్లకు దీని ఎర్లీ యాక్సెస్ అందుబాటులో ఉంటుందని ఎలాన్ మస్క్ ప్రకటించారు. దీనిపై X ఇప్పటికే వీసా సంస్థతో టైయప్ అయింది. కాగా Xను SM కంటే ఫైనాన్స్‌కు ప్రాధాన్యం ఉన్న ప్లాట్‌ఫామ్‌గా మారుస్తానని మస్క్ గతంలో పలుమార్లు పేర్కొన్నారు. ట్రయల్స్ ఓకే అయితే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వస్తుంది.


