News July 11, 2024
75% హాజరు ఉంటేనే రూ.15,000.. జీవో విడుదల
AP: ‘తల్లికి వందనం’ పథకంపై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు ఏడాదికి రూ.15వేల సాయం అందిస్తామని పేర్కొంది. విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. 1 నుంచి 12వ తరగతి పిల్లలకు ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలిపింది. గత ప్రభుత్వంలో ‘అమ్మఒడి’గా ఉన్న ఈ పథకాన్ని ఎన్డీయే సర్కారు ‘తల్లికి వందనం’గా మార్చింది.
Similar News
News January 19, 2025
రేషనలైజేషన్‌ను తప్పుబడుతోన్న ఉద్యోగ సంఘాలు
AP: గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) చేపట్టాలన్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సచివాలయ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీని వల్ల ఉద్యోగులపై తీవ్రమైన పని భారం పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. మల్టీపర్పస్ ఉద్యోగులు అనే పేరుతో వివిధ పనులకు సచివాలయ ఉద్యోగులను వినియోగించుకోవాలనుకోవడం సరికాదని పేర్కొన్నాయి.
News January 19, 2025
OTTలోకి వచ్చేసిన కొత్త సినిమా
విజయ్ సేతుపతి నటించిన ‘విడుదల పార్ట్-2’ OTTలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పార్ట్-1 స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టలేకపోయింది. పార్ట్-1 కూడా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
News January 19, 2025
NDRF రైజింగ్ డే వేడుకలు.. పాల్గొననున్న షా, బాబు, పవన్
AP: నేడు విజయవాడ సమీపంలోని గన్నవరంలో NDRF రైజింగ్ డే వేడుకలు జరగనున్నాయి. ఇందులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. కొండపావులూరులో NDRF, SDRF ప్రాంగణాలను షా ప్రారంభించనున్నారు. అనంతరం HYD పోలీస్ అకాడమీలో రూ.27 కోట్లతో నిర్మించనున్న షూటింగ్ రేంజ్‌కు శంకుస్థాపన చేయనున్నారు.