News November 11, 2024

రూ.2.90 లక్షల కోట్లు.. నేడే పూర్తిస్థాయి బడ్జెట్

image

AP: 2024-25కు రూ.2.90 లక్షల కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ నేడు శాసనసభకు సమర్పించనున్నారు. వ్యవసాయ బడ్జెట్‌ను అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. ఇవే పద్దులను కొల్లు రవీంద్ర, నారాయణ మండలి ముందు ఉంచుతారు. అమరావతి, పోలవరం, సంక్షేమం, విద్య, వైద్యానికి అధికంగా నిధులు కేటాయిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే 2 సార్లు ఓట్ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌తో నిధులు ఖర్చు చేసిన విషయం తెలిసిందే.

Similar News

News December 4, 2024

అల్లు అర్జున్‌కు విషెస్ తెలిపిన మెగా హీరో

image

భారీ అంచనాలతో రిలీజవుతున్న ‘పుష్ప-2’ సినిమా గురించి మెగా కుటుంబం నుంచి ఎవరూ మాట్లాడట్లేదని నెట్టింట చర్చ జరుగుతోంది. ఈక్రమంలో మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా ‘పుష్ప-2’ టీమ్‌కు విషెస్ తెలిపారు. ‘అల్లు అర్జున్, సుకుమార్‌ & టీమ్‌కు నా హృదయపూర్వక బ్లాక్ బస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఈరోజు రాత్రి నుంచి ‘పుష్ప-2’ ప్రీమియర్స్ మొదలు కానున్నాయి.

News December 4, 2024

పుష్ప-2 ఇడ్లీల పేరుతో RGV ట్వీట్

image

సినిమాలు లాభాల కోసమే నిర్మిస్తారని, ప్రజా సేవకు కాదని RGV అన్నారు. సుబ్బారావు అనే వ్యక్తి హోటల్ పెట్టి ఇడ్లీ ప్లేట్ రూ.1000గా నిర్ణయించారని, ధర అందుబాటులో లేదని ఏడిస్తే అది సెవెన్ స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదని ఏడ్చినంత వెర్రితనమన్నారు. అలాగే పుష్ప-2ది సెవెన్ స్టార్ క్వాలిటీ అన్నారు. అటు, ఎంటర్టైన్మెంట్ అంత నిత్యావసరమా? రేట్లు తగ్గాక కూడా చూసుకోవచ్చు కదా? అని ‘X’లో పోస్ట్ చేశారు.

News December 4, 2024

పాకిస్థాన్‌తో మ్యాచ్.. భారత్‌కు ALL THE BEST

image

మెన్స్ జూనియర్ ఆసియా కప్ హాకీ మ్యాచ్‌లో భారత్-పాకిస్థాన్ ఇవాళ తలపడనున్నాయి. మలేషియాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో 3-1తేడాతో గెలవడంతో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇవాళ రాత్రి 8.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో పాక్‌తో అమీతుమీ తేల్చుకోనున్న భారత జట్టుకు ఫ్యాన్స్ ALL THE BEST చెబుతున్నారు.