News November 9, 2024
డిసెంబర్ లోపు రూ.2 లక్షల రుణమాఫీ: మంత్రి పొంగులేటి
TG: రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొంటామని, ఎవరూ అధైర్యపడొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భరోసానిచ్చారు. పంటలకు మద్దతు ధర కల్పిస్తామని హామీనిచ్చారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్న ఆయన, డిసెంబర్ నెలాఖరులోపు రూ.13 వేల కోట్ల పెండింగ్ బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. గ్రూప్ 1 అభ్యర్థులకు డిసెంబర్‌లో నియామక పత్రాలు అందిస్తామని వెల్లడించారు.
Similar News
News December 2, 2024
నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ
AP: నేటి నుంచి ఈ నెల 28 వరకు కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం దరఖాస్తులు కోరుతోంది. వీటితోపాటు కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. అర్హులకు సంక్రాంతి నుంచి కొత్త కార్డులు అందించనుంది. జగన్ బొమ్మ ఉన్న రేషన్ కార్డులకు బదులు కొత్తవాటిని ఇవ్వనుంది. కొత్త రేషన్ కార్డుల కోసం తమ గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే పౌరసరఫరాలశాఖ అధికారికి వెబ్‌సైట్‌లోనూ అప్లై చేసుకోవచ్చు.
News December 2, 2024
జగన్ ఆస్తుల కేసులపై సుప్రీం కీలక ఆదేశం
ఏపీ మాజీ CM జగన్ ఆస్తులపై ఉన్న కేసులకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్లతో పాటు తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్లను వివరించాలంది. సీబీఐ, ఈడీ కేసుల వివరాలు చార్ట్ రూపంలో అందించాలని ధర్మాసనం తెలిపింది. అన్ని వివరాలతో అఫిడవిట్లు 2 వారాల్లో దాఖలు చేయాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ఆదేశించింది.
News December 2, 2024
కోహ్లీ అంటే నా వ్యక్తిగత వైద్యుడికి చాలా ఇష్టం: ఆస్ట్రేలియా PM
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గురించి ‘స్టార్ స్పోర్ట్స్’తో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నా వ్యక్తిగత వైద్యుడు విరాట్ కోహ్లీకి వీరాభిమాని. ఆయనకు కోహ్లీ అంటే ఎంత ఇష్టమో చెప్పేందుకు ఒక్క పదం చాలదు. ఇటీవల ఆయన్ను కలిసినప్పుడు నేను విరాట్‌ను కలుస్తున్నట్లు చెప్తే నమ్మలేకపోయాడు. తప్పనిసరిగా ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఆయన కోరారు’ అని తెలిపారు.