News May 26, 2024

రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందనడం హాస్యాస్పదం: ఉత్తమ్

image

TG: గత ప్రభుత్వం క్వింటా ధాన్యానికి రూ.1700 ఇస్తే, తాము రూ.2007 చెల్లిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు రూ.200 కోట్ల ధాన్యం కొనుగోలు చేస్తే BRS, BJP మాత్రం కొనుగోళ్లలో రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందనడం హాస్యాస్పదమన్నారు. తనపై బాధ్యతారహితమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. BJP పాలిత రాష్ట్రాల్లోనూ తాలు, తరుగు తీస్తున్నారని ప్రెస్‌మీట్‌లో చెప్పారు.

Similar News

News December 31, 2024

కండోమ్స్, ORSలతో న్యూఇయర్ పార్టీ ఇన్విటేషన్

image

మహారాష్ట్ర పుణేలో ఓ పబ్ నిర్వాహకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. న్యూఇయర్ వేడుకల్లో పాల్గొనేందుకు యువతకు ఇన్విటేషన్ లెటర్‌తోపాటు కండోమ్‌లు, ORS ప్యాకెట్లను పంపారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరలవడంతో నెటిజన్లు ఫైరవుతున్నారు. మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఇన్విటేషన్ పొందిన వ్యక్తుల వాంగ్మూలాలను రికార్డు చేశామని వారు చెప్పారు.

News December 31, 2024

‘మ్యాడ్’ దర్శకుడితో మాస్ మహరాజా సినిమా?

image

‘మ్యాడ్’ సినిమాతో డైరెక్టర్‌గా సూపర్ సక్సెస్ సాధించి, దానికి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ రూపొందిస్తున్నారు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. ఇటీవల ఆయన మాస్ మహరాజా రవితేజకు ఓ కథ వినిపించారని సినీ వర్గాలు వెల్లడించాయి. రవితేజ ఈ స్క్రిప్ట్‌ను ఓకే చేస్తే సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News December 31, 2024

విస్కీ ఛాలెంజ్.. ఇన్‌ఫ్లూయెన్సర్ దుర్మరణం

image

థాయ్‌లాండ్‌లో తనకర్న్ కాంథీ(21) అనే ఇన్‌ఫ్లూయెన్సర్ మద్యం ఛాలెంజ్‌లో విఫలమై దుర్మరణం పాలయ్యాడు. రూ.75,000 ఇస్తే ఒక్కోటి 350ML క్వాంటిటీగల మూడు బాటిళ్ల విస్కీని తాగేస్తానంటూ పందెం కాశాడు. అప్పటికే ఫుల్లుగా తాగిన అతను ఛాలెంజ్‌లో భాగంగా మరో 2 బాటిళ్లను 20 నిమిషాల్లో తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ పందెం కాసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.