News May 26, 2024
రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందనడం హాస్యాస్పదం: ఉత్తమ్

TG: గత ప్రభుత్వం క్వింటా ధాన్యానికి రూ.1700 ఇస్తే, తాము రూ.2007 చెల్లిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు రూ.200 కోట్ల ధాన్యం కొనుగోలు చేస్తే BRS, BJP మాత్రం కొనుగోళ్లలో రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందనడం హాస్యాస్పదమన్నారు. తనపై బాధ్యతారహితమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. BJP పాలిత రాష్ట్రాల్లోనూ తాలు, తరుగు తీస్తున్నారని ప్రెస్‌మీట్‌లో చెప్పారు.
Similar News
News February 7, 2025
మరోసారి.. ఢిల్లీ స్కూళ్లకు ఆగని బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. ఇవాళ ఉదయం మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఢిల్లీతో పాటు నోయిడాలోని పాఠశాలలకు కూడా ఈ థ్రెట్స్ రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయా స్కూళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
News February 7, 2025
ఎవరి ముందూ మోకరిల్లను: తీన్మార్ మల్లన్న

TG: తనకింకా షోకాజ్ నోటీసులు రాలేదని కాంగ్రెస్ MLC తీన్మార్ మల్లన్న తెలిపారు. వచ్చినా భయపడేది లేదని తేల్చిచెప్పారు. తీన్మార్ మల్లన్న ఎవరి ముందూ మోకరిల్లడంటూ వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ తీరు బీసీలందరికీ షోకాజ్ ఇచ్చినట్లుగా ఉంది. దేనికీ నోటీసులు? వాటిని కులగణనలో భాగమైన నాయకులకివ్వాలి. అధిష్ఠానం ఆదేశాల్ని పాటించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కులగణన అనేది పూర్తిగా జానారెడ్డి నివేదిక’ అని ఆరోపించారు.
News February 7, 2025
మరోసారి SVSC తరహా మూవీ తీయనున్న అడ్డాల?

‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’తో మంచి విజయాన్ని దక్కించుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, ఆ తర్వాత మళ్లీ అలాంటి విజయాన్ని అందుకోలేకపోయారు. ముకుంద, నారప్ప ఫర్వాలేదనిపించగా బ్రహ్మోత్సవం, పెదకాపు నిరాశపరిచాయి. దీంతో ఆయన మరోసారి SVSC తరహా కుటుంబ కథను నమ్ముకున్నట్లు తెలుస్తోంది. అక్కాచెల్లెళ్ల మధ్య సాగే భావోద్వేగాలే ఇతివృత్తంగా ‘కూచిపూడి వారి వీధి’ అన్న మూవీని తెరకెక్కిస్తున్నారని సమాచారం.