News February 20, 2025
ఖాతాల్లోకి రూ.2,000.. ఎవరికంటే?

TG: పీఎం కిసాన్ 19వ విడత కింద ఈనెల 24న రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నగదు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధులు రిలీజ్ చేయనున్నారు. E-KYC పూర్తి చేసిన వారికి మాత్రమే డబ్బులు అందుతాయి. ఈ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుందని అధికారులు తెలిపారు. కేంద్రం 2018 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
Similar News
News March 22, 2025
కెప్టెన్సీకి హీథర్ నైట్ రాజీనామా

ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీకి హీథర్ నైట్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ECB ధ్రువీకరించింది. 9 ఏళ్లపాటు సేవలందించినందుకు థ్యాంక్స్ అని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 2016లో కెప్టెన్‌గా ఎంపికైన హీథర్ ఏకంగా 199 మ్యాచ్(టెస్టు, వన్డే, టీ20)లకు నాయకత్వం వహించారు. ఆమె సారథ్యంలోనే ఇంగ్లండ్ 2017 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. హీథర్ 3 ఫార్మాట్లలో 7వేలకు పైగా రన్స్, 84 వికెట్లు తీశారు.
News March 22, 2025
IPL: ఈసారైనా వీరికి టైటిల్ దక్కేనా?

ఐపీఎల్‌లో కొన్ని జట్లు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయాయి. వాటిలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, RCB, LSG ఉన్నాయి. ఈ సారైనా తమ ఫేవరెట్ జట్లు కప్పు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఐపీఎల్ 18వ సీజన్ నేటి నుంచి మే 25 వరకు కొనసాగనుంది. 64 రోజులపాటు 74 మ్యాచులు జరగనున్నాయి. ప్రస్తుతం టైటిల్ కోసం 10 జట్లు బరిలోకి దిగుతున్నాయి. మీ ఫేవరెట్ టీమ్ ఏదో కామెంట్ చేయండి.
News March 22, 2025
ALERT: రేపు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షం

AP: రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడుతుందని APSDMA తెలిపింది. మరోవైపు ఎండ తీవ్రత కూడా కొనసాగుతుందని పేర్కొంది. కూలీలు, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని విజ్ఞప్తి చేసింది. అలాగే ఇవాళ అత్యధికంగా కర్నూలు జిల్లా ఆస్పరి, సత్యసాయి జిల్లా తొగరకుంటలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది.