News October 8, 2024

పోలవరం సందర్శకుల ఖర్చులకు రూ.23 కోట్లు విడుదల

image

AP: గత టీడీపీ ప్రభుత్వంలో ప్రజలను పోలవరం ప్రాజెక్టుకు సందర్శనకు ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్లి ఉచితంగా భోజనాలు పెట్టేవారు. దీనికి సంబంధించి 2018 డిసెంబర్ నుంచి 2019 మార్చి వరకు ఖర్చు చేసిన నిధులను కాంట్రాక్టర్లకు వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదు. వారు హైకోర్టును ఆశ్రయించగా 12 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. దీంతో మొత్తం రూ.23.11 కోట్ల నిధుల విడుదలకు జలవనరుల శాఖ తాజాగా ఆమోదం తెలిపింది.

Similar News

News November 27, 2025

ANRFలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్( <>ANRF<<>>)లో 7 పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. అర్హతగల అభ్యర్థులు జనవరి 14 వరకు అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం సైంటిస్ట్-Dకు నెలకు రూ.78,800-రూ.2,09200, సైంటిస్ట్ -C పోస్టుకు రూ.67,700-రూ.2,08700 చెల్లిస్తారు. వెబ్‌సైట్: serb.gov.in/

News November 27, 2025

నటిని పెళ్లి చేసుకున్న మాజీ క్రికెటర్

image

తమిళ బిగ్‌బాస్ ఫేమ్ సంయుక్త షణ్ముఘనాథన్‌ను మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కుమారుడు, IPL మాజీ ప్లేయర్ అనిరుద్ధ శ్రీకాంత్‌ వివాహమాడారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడంతో కుటుంబసభ్యుల సమక్షంలో జరిగినట్లు సినీవర్గాలు తెలిపాయి. సంయుక్త నటిగా, మోడల్‌గా గుర్తింపు పొందగా.. అనిరుద్ధ IPLలో 2008 నుంచి 14 వరకూ CSK, SRH జట్లకు ప్రాతినిధ్యం వహించారు. వివాహానికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.

News November 27, 2025

ఇండస్ట్రియల్ పాలసీపై అసత్య ప్రచారం: ఉత్తమ్

image

TG: ఇండస్ట్రియల్ పాలసీలో కుంభకోణానికి ఆస్కారమే లేదని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ‘హైదరాబాద్‌ని కాలుష్యరహితంగా మార్చేందుకు ఇండస్ట్రీలను ORR బయటకి పంపాలన్న డిమాండ్ ఉంది. ఇది మేం కొత్తగా తెచ్చిన పాలసీ కాదు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లుతున్నాయి. BRS హయాంలోనూ దీనిపై చర్చ జరిగింది. విద్యుత్‌లో రూ.50 వేల కోట్లు కాదు రూ.50 వేల కుంభకోణం కూడా జరగలేదు’ అని తెలిపారు.