News August 9, 2024

ఏపీకి రూ.2,300 కోట్ల ‘ఉపాధి’ బకాయిలు విడుదల

image

AP: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఏపీకి 3 నెలల బకాయిలు రూ.2,300 కోట్లను కేంద్రం విడుదల చేసింది. త్వరలోనే కూలీల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. దీంతో మే నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో అవస్థలు పడుతున్న కూలీలకు ఊరట కలగనుంది. ఏపీకి కేటాయించిన 15 కోట్ల పనిదినాలు జూన్ నెలాఖరుకే పూర్తికావడంతో డిప్యూటీ సీఎం పవన్ విజ్ఞప్తి మేరకు మరో 6.50 కోట్ల పనిదినాలకు కేంద్రం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

Similar News

News November 16, 2025

ఈరోజు వీటిని తినకూడదట.. ఎందుకంటే?

image

కార్తీక మాసంలో ఆదివారం రోజున ఉసిరి, కొబ్బరిని ఆహారంగా తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. ‘ఉసిరి చెట్టు లక్ష్మీదేవి స్వరూపం. విష్ణు కొలువై ఉండే వృక్షంగా దీన్ని భావిస్తారు. కొబ్బరి కూడా పవిత్రమైన పూజా ద్రవ్యం. సూర్యభగవానుడికి అంకితమైన ఈ ఆదివారం రోజున ఈ పవిత్ర వృక్షాలను గౌరవించాలి. వాటి ఫలాలను ఆహారంగా స్వీకరించడం ధర్మం కాదని గ్రహించాలి. ఈ నియమాలు పాటిస్తే శుభాలు కలుగుతాయి’ అని సూచిస్తున్నారు.

News November 16, 2025

ఆవుండగా గాడిద పాలు పితికినట్లు

image

ఒక పనిని సులభంగా, సరైన మార్గంలో చేసే అవకాశం లేదా వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ.. దానిని విస్మరించి, కష్టమైన, పనికిరాని, అసాధ్యమైన మార్గాన్ని ఎంచుకున్న సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. అందుబాటులో ఉన్న మంచి అవకాశాన్ని వదులుకుని అనవసరమైన శ్రమకు పోవడాన్ని ఈ సామెత సూచిస్తుంది.

News November 16, 2025

వణికిస్తున్న చలి.. పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 3-5 డిగ్రీల మేర తగ్గిపోయాయి. దీంతో APలోని అల్లూరి(D) అరకులో అత్యల్పంగా 7 డిగ్రీలు నమోదయ్యాయి. TGలోని సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో 8.1 డిగ్రీలు రికార్డయ్యాయి. ఆసిఫాబాద్‌లో 8.4, ఆదిలాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో 8.6 చొప్పున నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది.