News April 10, 2025
3 రోజులకు రూ.25 కోట్లు.. నో చెప్పిన ప్రభాస్!

పాన్ ఇండియా రేంజ్లో పాపులారిటీ ఉన్నా ప్రభాస్ యాడ్స్‌లో కనిపించేది చాలా తక్కువే. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బాహుబలికి ఓ బ్రాండ్ యాడ్‌లో నటించాలని ఆఫర్ వచ్చిందట. 3 రోజులు కేటాయిస్తే రూ.25 కోట్లు ఇస్తామని ఆఫర్ చేయగా ప్రభాస్ సింపుల్‌గా నో చెప్పారని సమాచారం. ప్రస్తుతం ఫౌజీ, ది రాజాసాబ్ చిత్రాలతో డార్లింగ్ తీరిక లేకుండా ఉన్నారు. ఆ తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2 చిత్రాల్లో నటించాల్సి ఉంది.
Similar News
News April 18, 2025
మస్క్‌తో చర్చలు.. మోదీ ట్వీట్

ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌తో చర్చలు జరిపినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించామని ప్రధాని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరువురి మధ్య జరిగిన విషయాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ రంగాలలో భారత్, అమెరికా భాగస్వామ్యం మరింత పురోగమిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
News April 18, 2025
జాట్ మూవీ టీంపై కేసు నమోదు

జాట్ మూవీ టీంపై పంజాబ్ జలంధర్‌లో కేసు నమోదైంది. ఈ చిత్రంలోని సన్నివేశాలు క్రిస్టియన్ల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ వికల్ప్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో సన్నీడియోల్, గోపీచంద్ మలినేనితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సన్నీడియోల్ హీరోగా నటించారు. ఏప్రిల్ 10న విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది.
News April 18, 2025
BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

AP: కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. హిందూపురానికి చెందిన నాగరాజు, నాగభూషణ్, మురళి, సోమలు యాద్గిర్(KA) జిల్లా షహర్‌పూర్‌కు బొలెరోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును వీరి వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో వీరంతా అక్కడికక్కడే మృతిచెందారు.