News November 22, 2024

మహిళలకు నెలకు రూ.2500.. కీలక ప్రకటన

image

TG: మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.2500, కళ్యాణలక్ష్మి ద్వారా తులం బంగారం కొత్త ఏడాదిలో అందజేయనున్నట్లు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. మంత్రుల సబ్ కమిటీ నివేదిక రాగానే రైతు భరోసా ఇస్తామన్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను DEC 9 నాటికి చెల్లించాలని CM నిర్ణయించినట్లు చెప్పారు. రూ.వేల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని BRS ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు.

Similar News

News November 22, 2024

డిసెంబర్ నుంచి పెన్షన్ల పెంపు?

image

TG: వచ్చే నెల 7వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తి కానుంది. ఆలోగా ఆసరా పెన్షన్ల పెంపు, రైతు భరోసా పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం ఆసరా పింఛన్లకు ₹2,016, దివ్యాంగ పింఛన్లకు ₹3,016 ఇవ్వగా, తాము ఆసరా పింఛను ₹4,000, దివ్యాంగ పింఛన్ ₹6,000 చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రైతు భరోసా కింద ఏటా ఎకరాకు ₹15,000 అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

News November 22, 2024

శాసనమండలిలో మాటల యుద్ధం

image

AP: శాసనమండలిలో EBC రిజర్వేషన్లపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. గత ప్రభుత్వ DBT విధానం వల్ల చాలామంది గంజాయి బారినపడ్డారని మంత్రి సవిత అన్నారని, ఆమె ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇరుపక్షాలు వాదనకు దిగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, రికార్డుల నుంచి వాటిని తొలగిస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.

News November 22, 2024

PAC ఎన్నికను బాయ్‌కాట్ చేసిన YCP

image

AP: PAC ఛైర్మన్‌ పదవిని ఎప్పటి నుంచో ప్రతిపక్షానికే కేటాయిస్తున్నారని, అందుకు విరుద్ధంగా ఎన్నిక నిర్వహిస్తున్నారని YCP నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అందుకే PAC ఎన్నికను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎప్పుడూ అధికార పక్షం ఈ పదవిని తీసుకోలేదని, అవినీతి జరగకుండా పీఏసీ వాచ్‌డాగ్‌ లా పని చేస్తుందన్నారు. అధికార పక్షం ఆ ఛైర్మన్ పదవి తీసుకుంటే ఏం న్యాయం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.