News November 22, 2024
మహిళలకు నెలకు రూ.2500.. కీలక ప్రకటన
TG: మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.2500, కళ్యాణలక్ష్మి ద్వారా తులం బంగారం కొత్త ఏడాదిలో అందజేయనున్నట్లు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. మంత్రుల సబ్ కమిటీ నివేదిక రాగానే రైతు భరోసా ఇస్తామన్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను DEC 9 నాటికి చెల్లించాలని CM నిర్ణయించినట్లు చెప్పారు. రూ.వేల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని BRS ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు.
Similar News
News December 5, 2024
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీఐడీ విచారణ
AP: రేషన్ బియ్యంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీఐడీ విచారణకు ఆదేశించారు. ఆ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు విదేశాలకు తరలిస్తున్నారనే అంశాలపై సీఐడీ విచారణ చేయనుంది.
News December 5, 2024
దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
AP: రాష్ట్రంలోని దివ్యాంగులకు త్రీ వీలర్ వాహనాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. రూ.లక్ష ఖరీదు చేసే వీటిని 100% సబ్సిడీతో అందించాలని నిర్ణయించింది. ఈ ఏడాది నియోజకవర్గానికి 10 చొప్పున అన్ని సెగ్మెంట్లకు కలిపి 1750 వాహనాలు ఇవ్వనుంది. నాలుగు నెలల్లో టెండర్లు నిర్వహించి లబ్ధిదారులకు వీటిని అందించనుంది. డిగ్రీ ఆపైన చదివిన వారికి, 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి తొలి దశలో వీటిని ఇస్తారు.
News December 5, 2024
సౌదీలో పుష్ప-2 ‘జాతర’ సీక్వెన్స్ తొలగింపు!
పుష్ప-2 సినిమాకు సౌదీ అరేబియా సెన్సార్ బోర్డు షాకిచ్చింది. ఇందులోని 19 నిమిషాల జాతర ఎపిసోడ్‌ను తొలగించినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. బన్నీ అమ్మవారి గెటప్, హిందూ దేవతల గురించి ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపింది. దీంతో 3 గంటల ఒక నిమిషం వ్యవధితోనే చిత్రం అక్కడ ప్రదర్శితమవుతున్నట్లు పేర్కొంది. కాగా సింగమ్ అగైన్, భూల్ భులయ్య-3 చిత్రాలను ఆ దేశం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.