News July 26, 2024

వరద బాధితులకు రూ.3వేల సాయం: చంద్రబాబు

image

AP: వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ‘జిల్లా మంత్రులు వరద బాధితులను వెంటనే పరామర్శించాలి. వారి కుటుంబాలకు తక్షణం రూ.3వేల సాయం అందించాలి. అధికారులు పంటనష్టం వివరాలు నమోదు చేయాలి. నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం. పైనుంచి వచ్చే వరద ప్రవాహం వల్లే రాష్ట్రంలో ఎక్కువ నష్టం జరిగింది. బాధితులకు గతంలో కంటే ఎక్కువ పరిహారం ఇస్తాం’ అని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు.

Similar News

News November 19, 2025

NZB: వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలి: DMHO

image

NZB జిల్లాలోని PHCలు, సబ్ సెంటర్లలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (DMHO) డా.రాజశ్రీ ఆదేశించారు. అవుట్ పేషెంట్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. గర్భిణుల వివరాల నమోదులో అలసత్వం వహించే ANMలు, ఆశా కార్యకర్తలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని సూచించారు.

News November 19, 2025

సంచలనం.. ఆత్మాహుతి దాడిలో తుర్కియే సంస్థల హస్తం?

image

ఎర్రకోట ఆత్మాహుతి దాడిలో తుర్కియే సంస్థల హస్తం ఉన్నట్లు NIA అనుమానిస్తోంది. ఇవాళ గ్రేటర్ నోయిడాలోని ఇస్తాంబుల్ ఇంటర్నేషనల్ Pvt Ltd ప్రింటింగ్ ప్రెస్‌లో ATS తనిఖీలు చేసింది. విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్‌ను ప్రచురిస్తున్నట్లు గుర్తించింది. CCTV ఫుటేజ్‌, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. సూసైడ్ బాంబర్ ఉమర్ 2022లో తుర్కియేకు వెళ్లి ఫారిన్ హ్యాండ్లర్ ఉకాసాను కలిసినట్లు సమాచారం.

News November 19, 2025

ఉమ్మడి మెదక్ జిల్లా వెదర్ రిపోర్ట్..!

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ 9.5, కోహిర్ 9.6, మెదక్ జిల్లా నర్లాపూర్ 9.5, దామరంచ 10.1, సిద్దిపేట జిల్లా బేగంపేట 8.6, పోతారెడ్డిపేట 9.6, కొండపాకలో 10.0 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, బాలింతలు, చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.