News April 12, 2025

డిస్కంలకు రూ.4,470 కోట్ల సబ్సిడీ నిధులు

image

AP: 2025-26 తొలి త్రైమాసికానికిగాను మూడు డిస్కంలకు సబ్సిడీ సొమ్ము విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రూ.4,470 కోట్లను డిస్కంల ఖాతాల్లో జమ చేయాలని పవర్ కోఆర్డినేషన్ కమిటీని ఆదేశిస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులిచ్చారు. ప్రజలపై టారిఫ్ భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Similar News

News January 15, 2026

ఏడాదికి రూ.40 లక్షలకు పైగా ఆదాయం

image

ప్రస్తుతం ఉమేష్ ఎకరానికి 10 టన్నుల తాజా మునగ ఆకులను సేకరిస్తున్నారు. ఆకులను షేడ్ నెట్ల కింద సహజంగా ఎండబెట్టి, దాదాపు 2.5 నుంచి 3 టన్నుల వరకు పొడిని సేకరిస్తారు. kg సగటున రూ.140 చొప్పున ఫార్మా కంపెనీలు, న్యూట్రాస్యూటికల్ కంపెనీలు, ఎరువుల కంపెనీలకు విక్రయిస్తున్నారు. డిమాండ్ బట్టి కొన్నిసార్లు రూ.500కు అమ్ముతారు. ఏడాదికి మునక్కాయలు, పొడి నుంచి 10 ఎకరాలకు రూ.40 లక్షల ఆదాయం పొందే స్థాయికి ఎదిగారు.

News January 15, 2026

సంక్రాంతికి అరిసెలు ఎందుకు చేస్తారు?

image

సంక్రాంతి పంటల పండుగ కాబట్టి కొత్తగా చేతికి వచ్చిన బియ్యం, బెల్లం, నువ్వులSతో అరిసెలు చేస్తారు. చలికాలంలో శరీరానికి అవసరమైన వేడిని, శక్తిని, ఐరన్‌ను ఈ పదార్థాలు అందిస్తాయి. అరిసెలు ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల, పండుగకు వచ్చే అతిథులకు, అత్తారింటికి వెళ్లే అల్లుళ్లకు వీటిని ప్రేమపూర్వకంగా ఇస్తుంటారు. సంప్రదాయం ప్రకారం శుభకార్యాలకు, పండుగలకు అరిసెను ఒక సంపూర్ణమైన, మంగళకరమైన పిండివంటగా భావిస్తారు.

News January 15, 2026

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఝార్ఖండ్‌లో ఉద్యోగాలు

image

<>సెంట్రల్ <<>>యూనివర్సిటీ ఆఫ్ ఝార్ఖండ్‌ 14 కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల వారు జనవరి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ, ME, MTech, MS, PhD, NET/SET/SLET అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. జనవరి 21నుంచి 24 వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు రూ.57,700 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://cuj.ac.in/