News December 2, 2024

ఎక్కువ ధరకు మద్యం అమ్మితే రూ.5లక్షల జరిమానా

image

AP: మద్యం అమ్మకాల్లో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. మద్యాన్ని MRP కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే రూ.5లక్షల ఫైన్ విధించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. మరోసారి అదే తప్పు చేస్తే మద్యం దుకాణం లైసెన్సును రద్దు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. వైన్స్ పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహించినా రూ.5లక్షల జరిమానా ఉంటుందని, బార్ లైసెన్సులకూ ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.

Similar News

News January 25, 2025

చంద్రబాబుకు బిల్ గేట్స్ గిఫ్ట్

image

మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ తనకు తన ‘సోర్స్ కోడ్’ బుక్‌ను ఇచ్చారని AP CM చంద్రబాబు తెలిపారు. కాలేజీని వదిలి మైక్రో‌సాఫ్ట్‌ను ఎలా ప్రారంభించారు? ఆయన జర్నీకి సంబంధించిన అనుభవాలు, పాఠాలను ఇందులో పొందుపరిచారని పేర్కొన్నారు. ఈ బుక్ చాలా మందికి స్ఫూర్తినిస్తుందని చెప్పారు. బిల్ గేట్స్‌కు ఆల్ ది బెస్ట్‌తో పాటు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల దావోస్‌లో వీరిద్దరూ భేటీ అయిన సంగతి తెలిసిందే.

News January 25, 2025

జగన్, VSR కలిసి డ్రామా ఆడుతున్నారు: బుద్దా వెంకన్న

image

AP: రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పడం జగన్‌కు తెలిసే జరిగిందని TDP నేత బుద్దా వెంకన్న అన్నారు. ‘కేసులను పక్కదారి పట్టించేందుకు ఈ డ్రామా. చంద్రబాబుతో విభేదాలు లేవంటే నమ్మేంత పిచ్చోళ్లు కాదు ప్రజలు. చంద్రబాబు కుటుంబాన్ని నువ్వు అన్న మాటలు మర్చిపోను. నిన్ను క్షమించను. మీరు చేసిన భూ కబ్జాలు, దోపిడీల లెక్క తేలాలి. విజయసాయిరెడ్డి దేశం విడిచి వెళ్లడానికి CBI అనుమతి ఇవ్వకూడదు’ అని ట్వీట్ చేశారు.

News January 25, 2025

నేడు VSR రాజీనామా

image

AP: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నిన్న ప్రకటించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నేడు ఉపరాష్ట్రపతితో భేటీ కానున్నారు. ఢిల్లీలో ఈ రోజు ఉ.10.30 గంటలకు ఆయనను కలిసి రాజీనామా లేఖను అందించనున్నారు. కాగా, ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని VSR తెలిపారు. తాను ఏ రాజకీయా పార్టీలోనూ చేరబోనని, వ్యవసాయం చేసుకుంటానని ట్వీట్ చేశారు.