News November 3, 2024
శబరిమల భక్తులకు రూ.5 లక్షల ఉచిత బీమా

ఈ ఏడాది శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తులందరికీ రూ.5 లక్షల ఉచిత బీమా కల్పించనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. నవంబర్ చివరి నుంచి ప్రారంభమయ్యే యాత్రా సీజన్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. సన్నిధానం, పంబ, అప్పచ్చిమేడు, నీలక్కల్ ఇతర ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని, గుండె సంబంధిత వ్యాధుల చికిత్సకూ ఏర్పాట్లు ఉంటాయని వివరించింది.
Similar News
News February 1, 2026
నిద్రలేమితో హెయిర్ ఫాల్

నిద్ర లేమి వల్ల శరీరంలో కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఈ హార్మోన్ స్థాయి పెరిగినప్పుడు.. అది నేరుగా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అధిక కార్టిసోల్ జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. దీని కారణంగా.. కుదుళ్లకు సరైన పోషణ అందక జుట్టు రాలడం మొదలవుతుంది. అంతేకాకుండా అసంపూర్తి నిద్ర జుట్టును బలహీనపరచడమే కాకుండా.. తల చర్మాన్ని కూడా పాడు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
News February 1, 2026
బనారస్ హిందూ యూనివర్సిటీలో ఉద్యోగాలు

<
News February 1, 2026
నవ గ్రహాలు – వాటి సొంత రాశులు

సూర్యుడు – సింహ రాశికి అధిపతి.
చంద్రుడు – కర్కాటక రాశికి అధిపతి.
బుధుడు – మిథున, కన్య రాశులకు అధిపతి.
కుజుడు – మేష, వృశ్చిక రాశులకు అధిపతి.
శుక్రుడు – వృషభ, తులా రాశులకు అధిపతి.
గురువు – ధనుస్సు, మీన రాశులకు అధిపతి.
శని – మకర, కుంభ రాశులకు అధిపతి.
రాహు, కేతువులు ఛాయాగ్రహాలు. అందువల్ల వీటికి ప్రత్యేక గృహాలు లేవు.


