News November 3, 2024
శబరిమల భక్తులకు రూ.5 లక్షల ఉచిత బీమా
ఈ ఏడాది శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తులందరికీ రూ.5 లక్షల ఉచిత బీమా కల్పించనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. నవంబర్ చివరి నుంచి ప్రారంభమయ్యే యాత్రా సీజన్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. సన్నిధానం, పంబ, అప్పచ్చిమేడు, నీలక్కల్ ఇతర ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని, గుండె సంబంధిత వ్యాధుల చికిత్సకూ ఏర్పాట్లు ఉంటాయని వివరించింది.
Similar News
News December 7, 2024
ఆటోల బంద్‌పై వెనక్కి తగ్గిన JAC
తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఆటోల బంద్‌కు పిలుపునిచ్చిన JAC దానిని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజాపాలన విజయోత్సవాలు ముగిసిన వెంటనే తమ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గినట్లు తెలిపింది. మహిళలకు ఉచిత బస్సు పథకంతో తమ గిరాకీ పోయి, ఉపాధి దెబ్బతిందని JAC నేతలు తొలుత ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చారు. తమకు ప్రభుత్వం ఏటా రూ.15వేలు చెల్లించాలని కోరుతున్నారు.
News December 7, 2024
సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
AP: 2025 ఏడాదికి సంబంధించి సాధారణ, ఆప్షనల్ హాలిడేల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీని ప్రకారం 23 సాధారణ, 19 ఆప్షనల్ సెలవులు ఉన్నాయి. 23 సాధారణ సెలవుల్లో రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం ఆదివారం రావడంతో 19 సెలవులు మాత్రమే ఉద్యోగులకు లభించనున్నాయి. ఆప్షనల్ హాలిడేస్‌లో ఈద్-ఎ-గదిర్, మహాలయ అమావాస్య ఆదివారం వచ్చాయి. మొత్తం 12 నెలల్లో మే, నవంబర్ తప్ప 10 నెలల్లో సెలవులు ఉన్నాయి.
News December 7, 2024
విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. సర్కార్ కీలక ఆదేశాలు
TG: రాష్ట్రంలోని ప్రభుత్వ, మోడల్ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్లు, KGBVల్లో ఆహార నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు జారీ చేసింది. బియ్యంలో పురుగులు, బూజు కనిపిస్తే వాడకూడదు. విద్యార్థులకు భోజనం వేడివేడిగా వడ్డించాలి. వండిన వెంటనే ప్రిన్సిపల్, మెస్ ఇన్‌ఛార్జి రుచి చూడాలి. మిగిలిన ఆహారాన్ని విద్యార్థులకు పెట్టకూడదు. రెండు పూటలకు పప్పు ఒకేసారి వండకూడదు. సిబ్బంది మాస్కు, టోపీ, ఆప్రాన్ ధరించాలి.