News November 15, 2024
నెలకు రూ.5వేలు.. నేడే లాస్ట్ డేట్

కేంద్రం అమలు చేస్తున్న ‘పీఎం ఇంటర్న్ షిప్’ పథకానికి దరఖాస్తు గడువు నేటితో (నవంబర్ 15) ముగియనుంది. దీని ద్వారా ప్రభుత్వం టాప్-500 కంపెనీల్లో యువతకు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తుంది. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చదివి, 21-24 ఏళ్ల వయసు కలిగిన వారు అర్హులు. ఎంపికైన వారికి ప్రభుత్వం నెలకు రూ.5వేలు స్టైఫండ్ ఇస్తుంది. https://pminternship.mca.gov.in సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.
Similar News
News March 6, 2026
ఎప్‌స్టీన్ ఫైల్స్.. ట్రంప్‌పై షాకింగ్ ఆరోపణలు

ఎప్‌స్టీన్ కేసులో అదృశ్యమైన 16 పేజీల డాక్యుమెంట్లను US DOJ తాజాగా బయటపెట్టింది. ఇందులో 1983లో ఒక మైనర్ బాలికపై ట్రంప్ లైంగిక దాడికి పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో తాను అడ్డుచెప్పగా ట్రంప్ తనను కొట్టి అక్కడి నుంచి పంపేశారని ఆ మహిళ FBI విచారణలో పేర్కొంది. ఈ రికార్డులను ఇన్నాళ్లూ ఎందుకు దాచారనే అంశం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. కాగా ట్రంప్ ఈ ఆరోపణలను ఖండించారు.
News March 6, 2026
ముంబై న్యూ జెర్సీలో హిట్‌మ్యాన్

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ IPL-2026కు ప్రిపేర్ అవుతున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్ న్యూ జెర్సీలో ఫొటోలకు పోజులిచ్చారు. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్.. ఐపీఎల్ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించారు. గతంతో పోలిస్తే ఫుల్ ఫిట్‌నెస్ సాధించిన హిట్‌మ్యాన్.. ప్రత్యర్థులపై ఎలా చెలరేగుతారో చూడాలి. మార్చి 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం అవుతుందని క్రీడావర్గాలు వెల్లడించాయి.
News March 6, 2026
అభిషేక్ మాదిరే వరుణ్‌ను ఎందుకు సపోర్ట్ చేయరు: సెహ్వాగ్

నిన్న ENGతో మ్యాచ్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 64 పరుగులు ఇవ్వడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీటిపై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ స్పందించారు. ‘ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా సరిగ్గా ఆడట్లేదు. అతడిని వెనకేసుకొస్తున్న వారికి బౌలర్‌కు సపోర్ట్ చేయడానికి ఎందుకు సమస్య? 3 మ్యాచ్‌లలో రన్స్ ఇవ్వగానే వేరే బౌలర్ కోసం చూస్తున్నామని చెబుతారు. ఆ కొత్త ప్లేయర్ రాణిస్తాడనే గ్యారంటీ ఏమిటి?’ అని ప్రశ్నించారు.


