News December 15, 2024
ఇంటి నిర్మాణానికి రూ.5,00,000.. UPDATE

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ప్రజాపాలనలో 80,54,554 దరఖాస్తులు రాగా ప్రతి 500కు ఒకరిని ఏర్పాటు చేసి సర్వే చేయిస్తున్నారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్తున్న అధికారులు 30-35 ప్రశ్నలు అడిగి వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు. ఖాళీ స్థలం, ప్రస్తుతం ఉంటున్న ఇంటి ఫొటోలను అప్లోడ్ చేస్తున్నారు. పథకం కింద ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.5,00,000 ఇవ్వనుంది.
Similar News
News November 25, 2025
ఆశ్లేష కురిస్తే ముసలియెద్దూ రంకెవేస్తుంది..

ఆశ్లేష నక్షత్రంలో ( జూలై చివరిలో/ ఆగస్టు ప్రారంభంలో) వర్షాలు బాగా పడితే, ఆ సంవత్సరంలో పంటలు బాగా పండుతాయని, పచ్చగడ్డి, మేత పుష్కలంగా లభిస్తాయని రైతులకు నమ్మకం. ఈ సమృద్ధి కారణంగా, సాధారణంగా నీరసంగా లేదా బలహీనంగా ఉండే ముసలి ఎద్దులు కూడా కడుపునిండా తిని, కొత్త శక్తిని పొంది, సంతోషంతో ఉత్సాహంగా అరుస్తాయనేది ఈ సామెత భావం. మంచి రోజులు వచ్చినప్పుడు అందరూ సంతోషిస్తారని అర్థం
News November 25, 2025
శివుడి అవతారమే హనుమంతుడు

హనుమంతుడు అంజనా దేవి పుత్రుడు. శివుడి వంటి పుత్రుడిని పొందాలని పరమేశ్వరుడికి పూజలు చేసింది. ఆ పూజల ఫలితంగా శివుడి వరంతోనే హనుమంతుడు జన్మించాడు. ఆయనను శివుని అవతారంగా భావిస్తారు. శివుడి లాగే ఆయన కూడా పరిపూర్ణ యోగి. అష్ట సిద్ధులకు యజమాని. ఆయన తన దైవశక్తిని ఏనాడూ స్వార్థానికి ఉపయోగించలేదు. తన ప్రభువు రాముడిని సేవించడానికి మాత్రమే వినియోగించారు. ఆయనను పూజిస్తే ఈశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతుందట.
News November 25, 2025
సీఎం రేవంత్ రెడ్డి నేటి షెడ్యూల్

TG: కీలక అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రులతో క్యాబినెట్ భేటీ నిర్వహించనున్నారు. ఉ.11 గంటలకు సెక్రటేరియట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. పంచాయతీ ఎన్నికలు, విద్యుత్ రంగంపై చర్చించనున్నారు. అటు సాయంత్రం 5 గంటలకు HYDలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ‘తెలంగాణ రైజింగ్-2047’పై సీఎం సమీక్ష నిర్వహిస్తారు.


