News February 7, 2025
క్రీడాకారులకు రూ.7.96 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల

AP: రాష్ట్ర క్రీడాకారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 189 మందికి రూ.7.96 కోట్ల ప్రోత్సాహాలను విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం 224 మందికి రూ.11.68 కోట్ల ఇన్సెంటీవ్లను పెండింగ్లో పెట్టిందని శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆరోపించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో రూ.7.96 కోట్లను రిలీజ్ చేశారని తెలిపారు.
Similar News
News November 24, 2025
తిరుపతిలో ఇవాళ బంగారం రేటు ఎంతంటే?

తిరుపతి జిల్లాలో సోమవారం 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.12,583గా ఉంది. 22 క్యారెట్లు రూ.11,534, 18 క్యారెట్లు రూ.9437 చొప్పున విక్రయిస్తున్నారు. పది రోజుల కిందట 24 క్యారెట్ల బంగారం గ్రాము 12,508గా ఉండేది. మరోవైపు ఇవాళ సిల్వర్ కేజీ రూ.1,71,900గా ఉంది. పది రోజుల కిందట కేజీ వెండి రూ.1.75,000 పలకగా.. ఇవాళ సుమారు రూ.3వేలు తగ్గింది.
News November 24, 2025
4,116 పోస్టులు.. రేపటి నుంచే దరఖాస్తుల ఆహ్వానం

RRC నార్తర్న్ రైల్వే 4,116 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. టెన్త్, ITI అర్హతగల వారు రేపటి నుంచి DEC 24వరకు అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, కార్పెంటర్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 24ఏళ్లు. టెన్త్, ITIలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: rrcnr.org * మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్స్ కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News November 24, 2025
PGIMERలో 151 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (PGIMER)లో 151 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, MS, MA/MSc, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, STలకు రూ.800, PwBDలకు ఫీజు లేదు. డిసెంబర్ 6న పరీక్ష నిర్వహిస్తారు. https://pgimer.edu.in


