News March 7, 2025
సూసైడ్ చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.7లక్షలు: అచ్చెన్న

APలో గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 39 మంది అన్నదాతలు/కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వీరి కుటుంబాలకు త్వరలో రూ.7 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. 2024 జూన్‌కు ముందు 103 మంది రైతులు సూసైడ్ చేసుకున్నారని చెప్పారు. వీరిలో 49 కుటుంబాలకు రూ.3.43 కోట్లు విడుదల చేశామన్నారు. మరో 32 కేసులకు రూ.2.24 కోట్లను త్వరలో రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News March 9, 2025
‘ఛాంపియన్’గా నిలిచేదెవరో?

వరుస విజయాలతో జోరు మీదున్న భారత జట్టు CT ఫైనల్లో ఇవాళ న్యూజిలాండ్‌తో తలపడనుంది. మ.2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్లేయర్లంతా ఫామ్‌లో ఉండటం, ఒకే వేదికలో ఆడటం INDకు కలిసొచ్చే అంశాలు. ICC ఈవెంట్లలో భారత్‌పై కివీస్‌దే పైచేయి కావడం కలవరపెడుతోంది. కాగా ఇవాళ హిట్‌మ్యాన్ సేన విజయ పరంపరను కొనసాగించి కప్పు గెలవాలని కోరుకుందాం. మ్యాచ్ లైవ్ జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో చూడొచ్చు.
News March 9, 2025
న్యాయం కోసం ప్రధానిని కలుస్తాం: హత్యాచార బాధితురాలి తల్లి

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార దోషి సంజయ్ రాయ్‌కి జనవరి 20న సెషన్ కోర్టు జీవితఖైదు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు వెనుక ఇంకా చాలామంది ఉన్నారంటూ మొదటి నుంచీ ఆరోపిస్తూ వస్తున్న బాధితురాలి తల్లి నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో మహిళలకు భద్రతే లేకుండా పోయిందన్నారు. తమ కూతురికి న్యాయం కోసం PM మోదీని కలుస్తామని చెప్పారు. ఈ విషయంలో ఆయన జోక్యం చేసుకోవాలని కోరారు.
News March 9, 2025
లోక్ అదాలత్ ఎఫెక్ట్.. ఒక్క రోజులో 49,056 కేసుల పరిష్కారం

AP: రాష్ట్రవ్యాప్తంగా నిన్న నిర్వహించిన లోక్ అదాలత్‌లలో 49,056 కేసులు పరిష్కారమయ్యాయి. మొత్తం బాధితులకు రూ.32.60 కోట్ల పరిహారం అందజేశారు. అన్ని న్యాయస్థానాల్లో 343 లోక్ అదాలత్ బెంచ్‌లు నిర్వహించగా ఇరు వర్గాల ఆమోదంతో రాజీకి ఆస్కారం ఉన్న కేసులను పరిష్కరించారు.