News January 9, 2025

పిల్లలకు జన్మనిస్తే రూ.81,000.. యువతులకు ఆఫర్

image

రష్యాలో గత ఏడాది జననాలు తగ్గడంతో ఆ దేశంలోని కరేలియా యంత్రాంగం సంచలన ప్రకటన చేసింది. 25 ఏళ్ల లోపు యువతులు ఆరోగ్యకరమైన చిన్నారులకు జన్మనిస్తే రూ.81,000 ఇస్తామని ప్రకటించింది. కరేలియాకు చెందిన వారై స్థానికంగా చదివేవారిని అర్హులుగా పేర్కొంది. అయితే ఇప్పటికే పిల్లలున్న వారికి ఇది వర్తించదని తెలిపింది. ఇతర ప్రాంతాలు ఇదే విధానాన్ని అనుసరించే యోచనలో ఉన్నాయి.

Similar News

News November 14, 2025

వణుకుతోన్న హైదరాబాద్.. సింగిల్ డిజిట్ నమోదు

image

చలికి హైదరాబాద్‌ మహానగరం గజగజ వణుకుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. నేడు అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 8.8°C నమోదైంది. రాజేంద్రనగర్‌లో 10.7, BHELలో 11.1, బొల్లారం, మారేడుపల్లి, గచ్చిబౌలిలో 11.7, కుత్బుల్లాపూర్‌లో 12.2, జీడిమెట్లలో 12.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే 3-4 రోజులూ ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది.

News November 14, 2025

జూబ్లీహిల్స్ కౌంటింగ్: షేక్‌పేట డివిజన్‌లో కాంగ్రెస్ లీడింగ్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో EVM ఓట్లను లెక్కిస్తున్నారు. తొలి రౌండ్‌లో కాంగ్రెస్ 47 ఓట్ల ఆధిక్యంలో ఉంది. షేక్‌పేట డివిజన్‌లో ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడింగ్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌కు 8,911, BRSకు 8,864 ఓట్లు పోలయ్యాయి. అటు పోస్టల్ బ్యాలెట్‌లోనూ కాంగ్రెస్‌కు ఆధిక్యం వచ్చింది. ఇక్కడ ముస్లిం ఓట్లు అధికంగా ఉండగా.. 11న పోలింగ్ రోజు సాయంత్రం BRS-కాంగ్రెస్ ఇక్కడ దొంగ ఓట్లపై ఆరోపణలు చేసుకున్నాయి.

News November 14, 2025

బిహార్‌లో 2 చోట్ల MIM ఆధిక్యం

image

దేశమంతా ఆసక్తిగా చూస్తున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఎర్లీ ట్రెండ్స్ BJPకి అనుకూలంగా ఉన్నాయి. NDA 66 స్థానాల్లో లీడింగ్‌లో ఉండగా ఇందులో BJPవి 40, JDU 24 స్థానాలు. ఇక MGB 44 చోట్ల లీడ్ ప్రదర్శిస్తుండగా వీటిలో RJD-35, కాంగ్రెస్-7 ఉన్నాయి. ఇక ఏ కూటమిలో లేని AIMIM 2 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఆమౌర్‌లో 2020లో గెలిచిన ఆ పార్టీ అభ్యర్థి అక్తారుల్ ఇమాన్ ఈసారీ లీడ్‌లో ఉన్నారు.