News July 25, 2024

ఒక్క రోజే రూ.83 లక్షల కోట్లు పోయె!

image

US స్టాక్ మార్కెట్లు చుక్కలు చూపిస్తున్నాయి. నాస్‌డాక్ 100 సూచీ బుధవారం 3% క్రాష్ అయింది. 2022 అక్టోబర్ తర్వాత ఇదే అతిఘోర పతనం. దీంతో రూ.83 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. టెస్లా, ఆల్ఫాబెట్ వంటి కంపెనీల ఫలితాలు నిరాశాజనకంగా ఉండటమే ఇందుకు కారణం. AIపై పెట్టుబడులు పెరగడం, లాభాలు రాకపోవడంతో కంపెనీలు నష్టపోతున్నాయి. నిన్న ఎన్‌విడియా, బ్రాడ్‌కామ్ వంటి టెక్ సంస్థల షేర్లు కుదేలయ్యాయి.

Similar News

News November 20, 2025

IBPS క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

image

అక్టోబర్ 4,5,11 తేదీల్లో నిర్వహించిన ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు <>వెబ్‌సైట్‌లో<<>> తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఈనెల 29న మెయిన్స్ జరగనున్నాయి. కాగా 13,533 పోస్టులను IBPS భర్తీ చేయనుంది.

News November 20, 2025

స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు ఆదేశం

image

TG: ఇంటర్​, డిగ్రీ, పాలిటెక్నిక్​ కాలేజీలకు సంబంధించి పెండింగ్​లో ఉన్న స్కాలర్​ షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్‌లో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2,813 కాలేజీలకు సంబంధించి రూ.161 కోట్ల బకాయిలు ఉన్నట్టుగా అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వీటిని వెంటనే విడుదల చేయాలని భట్టి ఆదేశించారు.

News November 20, 2025

అందుకే రూపాయి పతనమైంది: RBI గవర్నర్

image

డాలర్‌కు డిమాండ్ పెరగడం వలనే రూపాయి పతనమైందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. రూపాయి విలువను నిర్దిష్టంగా లెక్కించడం లేదని స్పష్టం చేశారు. అమెరికన్ కరెన్సీకి విలువ పెరగడం వల్లే రూపాయి విలువ తగ్గిందన్నారు. మార్కెట్ ఎలా జరుగుతోంది అనే దానిపైనే రూపాయి విలువ ఆధారపడి ఉంటుందని చెప్పారు. డాలర్‌కు డిమాండ్ పెరిగితే రూపాయి విలువ తగ్గినట్టే, రూపాయి డిమాండ్ పెరిగితే డాలర్ పతనమవుతుందని తెలిపారు.