News July 25, 2024
ఒక్క రోజే రూ.83 లక్షల కోట్లు పోయె!
US స్టాక్ మార్కెట్లు చుక్కలు చూపిస్తున్నాయి. నాస్‌డాక్ 100 సూచీ బుధవారం 3% క్రాష్ అయింది. 2022 అక్టోబర్ తర్వాత ఇదే అతిఘోర పతనం. దీంతో రూ.83 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. టెస్లా, ఆల్ఫాబెట్ వంటి కంపెనీల ఫలితాలు నిరాశాజనకంగా ఉండటమే ఇందుకు కారణం. AIపై పెట్టుబడులు పెరగడం, లాభాలు రాకపోవడంతో కంపెనీలు నష్టపోతున్నాయి. నిన్న ఎన్‌విడియా, బ్రాడ్‌కామ్ వంటి టెక్ సంస్థల షేర్లు కుదేలయ్యాయి.
Similar News
News October 4, 2024
నెల్సన్ కథకు ఓకే చెప్పిన జూ.ఎన్టీఆర్?
‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో జూ.ఎన్టీఆర్ ఓ సినిమాలో నటించే అవకాశం కన్పిస్తోంది. ఇటీవల దర్శకుడు చెప్పిన కథకు యంగ్ టైగర్ ఓకే చెప్పారని సమాచారం. వార్-2, ప్రశాంత్ నీల్ చిత్రాల తర్వాతే ఇది పట్టాలెక్కనుందని టాక్. మరోవైపు నెల్సన్ కూడా జైలర్-2 ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. దీంతో NTR-నెల్సన్ చిత్రంపై అధికారిక ప్రకటన రావడానికి మరింత సమయం పట్టొచ్చని తెలుస్తోంది.
News October 4, 2024
48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు: సీఎం రేవంత్
TG: రాష్ట్రంలో ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణంలో 58% సన్న రకాలు సాగయ్యాయని సీఎం రేవంత్ తెలిపారు. భవిష్యత్తులో 100% సన్నాలు పండించే రోజులు వస్తాయన్నారు. ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాకు ₹500 బోనస్ చెల్లిస్తామని, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పారు. సన్న వడ్ల సేకరణకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు లేదా కొనుగోలు కేంద్రాల్లో వేర్వేరు కాంటాలు ఏర్పాటు చేస్తామన్నారు.
News October 4, 2024
వరి పంట కొనుగోలు కేంద్రాలు సిద్ధం
TG: వరి పంట కొనుగోలు కేంద్రాలను ఒకట్రెండు రోజుల్లో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7139 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వరి సాగు ముందుగా పూర్తైన NZB, NLG జిల్లాల్లో తొలుత కేంద్రాలను ప్రారంభించనున్నారు. 88.09 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో 48.91 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు.