News January 2, 2025

రాష్ట్రానికి రూ.963.93కోట్ల నిధులు మంజూరు

image

AP: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.963.93 కోట్లు మంజూరు చేసింది. NH-16పై ఉన్న అనకాపల్లి- ఆనందపురంను కలుపుతూ 6 లైన్ హైవే కోసం నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి గడ్కరీ ట్వీట్ చేశారు. 12.66 కి.మీ మేర చేపట్టనున్న ఈ ప్రాజెక్టు అనకాపల్లి జిల్లాలోని సబ్బవరం గ్రామంలో ప్రారంభమై విశాఖ జిల్లా షీలానగర్ జంక్షన్ వద్ద ముగియనుంది. దీంతో విశాఖ పోర్టుకు కనెక్టివిటీ పెరగడంతో పాటు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.

Similar News

News January 20, 2025

రద్దీగా మారిన హైదరాబాద్

image

నేటి నుంచి ఆఫీస్‌లు, పాఠశాలలు పూర్తిస్థాయిలో పనిచేయనున్న నేపథ్యంలో సంక్రాంతి పండగకు ఊరెళ్లిన ప్రజలు తెల్లవారుజామునే హైదరాబాద్‌లో వాలిపోయారు. వివిధ ప్రాంతాల నుంచి నిన్న రాత్రి బయల్దేరి మహానగరంలో అడుగుపెట్టారు. దీంతో మెట్రో రైళ్లు, RTC బస్సులు రద్దీగా ప్రయాణిస్తున్నాయి. MGBS, JBS సహా అమీర్‌పేట్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, LBనగర్ తదితర ప్రాంతాలు RTC, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో సందడిగా మారాయి.

News January 20, 2025

ప్రభుత్వం సర్వే.. ఇళ్లు లేని కుటుంబాలు 30.29 లక్షలు

image

TG: ఇందిరమ్మ ఇళ్లు అందజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అర్హుల ఎంపిక కోసం సర్వే నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 30.29 లక్షల కుటుంబాలకు ఇళ్లు లేవని తేలింది. వీటిలో 18.68 లక్షల ఫ్యామిలీలకే సొంత స్థలం ఉంది. తొలి విడతలో సొంత స్థలం ఉన్నవారికే ఆర్థిక సాయం చేయాలని సర్కార్ భావిస్తోంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత విడతలవారీగా రూ.5లక్షల చొప్పున మంజూరు చేయనుంది.

News January 20, 2025

నేటి నుంచి WEF.. హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు

image

ప్రపంచ ఆర్థిక సదస్సు(WEF) నేటి నుంచి దావోస్‌లో ప్రారంభం కానుంది. ఐదు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు వెళ్లారు. మూడు రోజులపాటు CBN బృందం, నాలుగు రోజుల పాటు రేవంత్ బృందం సమావేశంలో పాల్గొననుంది. భారీగా పెట్టుబడులను ఆకర్షించడంపై ఇరురాష్ట్రాల సీఎంలు దృష్టిపెట్టారు. ఈ సదస్సులో భారత్ సహా పలు దేశాలకు చెందిన 2,800 మంది నేతలు పాల్గొంటారు.