News March 17, 2024

RS ప్రవీణ్‌కుమార్‌కు మంచి ఆఫర్ ఇచ్చా: సీఎం రేవంత్

image

TG: RS ప్రవీణ్ కుమార్ BRSలో చేరనున్నారనే వార్తలపై CM రేవంత్ రెడ్డి స్పందించారు. ‘ప్రవీణ్ BRSలో చేరతారని అనుకోను. ఆయన పట్ల నాకు గౌరవం ఉంది. సర్వీసులో ఉంటే DGP అయ్యేవారు. మొన్న కూడా నేను ఆయనకు TSPSC ఛైర్మన్ ఆఫర్ ఇచ్చా. కానీ ఆయన దాన్ని తిరస్కరించారు. సమాజానికి ఇంకా ఏదో చేయాలన్న తపనతో ఉన్నారు. ఇప్పుడు KCRతో చేరితే దానిపై ఆయనే ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని అన్నారు.

Similar News

News April 24, 2025

హిమాచల్ ప్రదేశ్‌లో హైఅలర్ట్

image

పహల్‌గామ్ ఉగ్రదాడి తరహాలో మరోసారి తీవ్రవాదులు హిమాచల్‌ప్రదేశ్‌లో దాడులకు తెగబడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు పోలీస్ శాఖను ఆదేశించారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌తో బార్డర్‌ను పంచుకునే చంబా, కంగ్రా జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు.

News April 24, 2025

ఓటముల్లో SRH సెంచరీ

image

SRH ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. IPL హిస్టరీలో 100 ఓటములను ఎదుర్కొన్న ఏడో టీమ్‌గా నిలిచింది. తొలి ఆరు స్థానాల్లో ఢిల్లీ(137), పంజాబ్(137), ఆర్సీబీ(132), KKR(125), ముంబై(121), రాజస్థాన్(113), CSK(105) ఉన్నాయి. SRHకు ముందు 2008-12 మధ్య హైదరాబాద్ వేదికగా ఉన్న డెక్కన్ ఛార్జర్స్ 75 మ్యాచ్‌లలో 46సార్లు ఓడిపోయింది.

News April 24, 2025

మే 20న అంగన్వాడీల సమ్మె

image

AP: వేతనాల పెంపుతో పాటు వేసవి సెలవులు, సెంటర్ల నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే మే 20న రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది. లబ్ధిదారులకు అందించే సరుకులన్నీ విడతల వారీగా కాకుండా ఒకేసారి ఇవ్వాలని, ఫేస్ యాప్ ఇన్, ఔట్ లొకేషన్ తొలగించాలని వారు కోరుతున్నారు.

error: Content is protected !!