News March 28, 2024
రూ. 20లక్షల కోట్లకు చేరిన రిలయన్స్ విలువ

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థ అరుదైన రికార్డు సాధించింది. మార్కెట్లో ఆ సంస్థ విలువ తాజాగా రూ.20లక్షల కోట్లకు చేరుకుంది. నిన్న సంస్థ షేర్ వాల్యూ రూ.2987ను తాకడంతో రిలయన్స్ విలువ రూ.70,039 కోట్ల మేర పెరిగి రూ.20,21,486 కోట్లను తాకింది. కాగా.. రిలయన్స్ తర్వాతి స్థానాల్లో TCS(రూ.14 లక్షల కోట్లు), HDFC (రూ.11 లక్షల కోట్లు), భారతీ ఎయిర్‌టెల్(రూ.7 లక్షల కోట్లు) ఉన్నాయి.
Similar News
News March 24, 2026
రైతుల అకౌంట్లలోకి రూ.69.98 కోట్లు: కలెక్టర్

జిల్లాలో యాసంగి సాగు పెట్టుబడి సాయం కింద మొదటి విడత నిధులు విడుదలయ్యాయని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. ఎకరం వరకు భూమి ఉన్న 1,43,259 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.69.98 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లకు ఈ ఆర్థిక సాయం రైతులకు ఎంతో ఊరటనిస్తుందని ఆమె వివరించారు.
News March 24, 2026
అభివృద్ధిని ఓర్వలేకే నిప్పు పెట్టారా అనే అనుమానాలు: హోంమంత్రి

AP: అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలపై హోంమంత్రి అనిత విచారణకు ఆదేశించారు. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నందున ప్రమాదవశాత్తు <<19460870>>అగ్నిప్రమాదం<<>> జరిగేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. అభివృద్ధిని ఓర్వలేకే నిప్పు పెట్టారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయని తెలిపారు. గతంలో అరటి తోటకు నిప్పు పెట్టారని గుర్తు చేశారు. అమరావతిపై కుట్రలు పన్నితే సహించేది లేదన్నారు.
News March 24, 2026
విగ్రహాల పరిమాణం ఎంత ఎత్తు వరకు ఉండవచ్చు?

ఇంట్లో విగ్రహాలు రెండున్నర అంగుళాల నుంచి 6 అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు ఉండకూడదు. మరీ పెద్ద విగ్రహాలు ఉంటే వాటికి శాస్త్రోక్తంగా నిత్యం అభిషేకాలు, నైవేద్యాలు సమర్పించాల్సి ఉంటుంది. లోహపు విగ్రహాలైతే పంచలోహాలు, వెండి లేదా రాగితో చేసినవి ఉత్తమం. విగ్రహాలకు ఎటువంటి పగుళ్లు ఉండకూడదు. ఒకే దేవుడి విగ్రహాలు రెండు కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవడం చాలా మంచిది. శివలింగం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది.


