News November 29, 2024
ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక RSP: సురేఖ
TG: మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ గురుకుల హాస్టళ్లలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక BRS నేత RS ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పనిచేశారని, తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక ఫుడ్ పాయిజన్‌తో ఒకే విద్యార్థిని మృతి చెందిందని, దీన్ని రాజకీయం చేయడం సరికాదని మంత్రి వ్యాఖ్యానించారు.
Similar News
News November 29, 2024
రేవంత్ ఏనాడైనా ‘జై తెలంగాణ’ అన్నాడా?: హరీశ్‌రావు
TG: CM రేవంత్ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా? అని మాజీ మంత్రి, BRS MLA హరీశ్ రావు ప్రశ్నించారు. ఆయనపై ఒక్క ఉద్యమ కేసైనా ఉందా అని అడిగారు. ఇచ్చిన ప్రత్యేక రాష్ట్ర ప్రకటనను కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తీసుకున్నప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున మొదలైందని, అప్పుడు MLAలంతా రాజీనామా చేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేశారని గుర్తు చేశారు. అప్పుడు రేవంత్ రాజీనామా చేయకుండా పారిపోయారని సిద్దిపేటలో హరీశ్ అన్నారు.
News November 29, 2024
పీరియడ్స్ ఇబ్బందుల్ని తొలగించే దాల్చినచెక్క
పీరియడ్స్ టైమ్‌లో అసౌకర్యాన్ని తొలగించడంలో దాల్చినచెక్క ఎంతగానో ఉపయోగపడుతుందని న్యూట్రిషనిస్టులు, వైద్యులు అంటున్నారు. ఆహారంలో దీన్ని భాగం చేసుకోవడం వల్ల తిమ్మిర్ల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్‌తో గర్భాశయ కండరాలు రిలాక్స్ అవుతాయి. రక్తనాళాలను సంకోచింపజేసి అధిక రక్తస్రావాన్నీ ఇది నివారించగలదు. వికారం, కడుపులో తిప్పడం, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది.
News November 29, 2024
రైతులకు ఏడాదిలో ₹54,280 కోట్ల ప్రయోజనం: పొంగులేటి
TG: కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి అగ్రపీఠం వేస్తోందని మంత్రి పొంగులేటి అన్నారు. ఏడాది కాలంలోనే అన్నదాతలకు ₹54,280కోట్ల ప్రయోజనం చేకూరిందని వివరించారు. 22లక్షలకుపైగా రైతులకు ₹17,870Cr రుణమాఫీ, పంటల బీమాకు ₹1,300Cr, ధాన్యం కొనుగోళ్లకు ₹5,040Cr, ఉచిత్ విద్యుత్‌కు ₹10,444Cr, రైతు భరోసాకు ₹7,625Cr, బీమా ప్రీమియానికి ₹1,455Cr, గత యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ₹10,547Cr వెచ్చించినట్లు తెలిపారు.