News November 29, 2024
ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక RSP: సురేఖ
TG: మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ గురుకుల హాస్టళ్లలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక BRS నేత RS ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పనిచేశారని, తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక ఫుడ్ పాయిజన్‌తో ఒకే విద్యార్థిని మృతి చెందిందని, దీన్ని రాజకీయం చేయడం సరికాదని మంత్రి వ్యాఖ్యానించారు.
Similar News
News December 11, 2024
ఎల్లుండి స్వర్ణాంధ్ర-2047 విజన్ విడుదల
AP: డిసెంబర్ 13న స్వర్ణాంధ్ర విజన్-2047ను విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయతీ స్థాయిలో ఈ విజన్ రూపొందించామన్నారు. దీని ఆధారంగానే రాష్ట్రంలో పరిపాలన ఉండాలని కలెక్టర్ల సమావేశంలో సీఎం వెల్లడించారు. 15శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకుని కలెక్టర్లు ఫలితాలు రాబట్టాల్సి ఉంటుందని సీఎం వెల్లడించారు.
News December 11, 2024
మోహన్ బాబు ఇంటి వద్ద మళ్లీ టెన్షన్
హైదరాబాద్ శంషాబాద్ జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రైవేట్ వ్యక్తులు బయటకు వెళ్లిపోవాలని మనోజ్ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే విష్ణు జోక్యం చేసుకుని ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఎవరూ లేరని బదులిచ్చారు. మనోజ్‌కు సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులు కూడా బయటకు వెళ్లాలని విష్ణు వార్నింగ్ ఇవ్వడంతో మళ్లీ అక్కడ ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
News December 11, 2024
బుమ్రాకు పెద్ద గాయం..?
BGTని దక్కించుకోవాలంటే టీమ్ ఇండియాకు బుమ్రా కీలకం. అందుకే రెండో టెస్టులో ఆయన గాయపడటం అభిమానుల్ని కలవరపెట్టింది. అది చిన్నగాయమేనని టీమ్ మేనేజ్‌మెంట్ కొట్టిపారేసినప్పటికీ.. ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ డేమియన్ ఫ్లెమింగ్ మాత్రం కాకపోవచ్చంటున్నారు. ‘అది తీవ్రగాయంలాగే కనిపిస్తోంది. బుమ్రా చివరి ఓవర్ కష్టంగా పూర్తి చేశారు. ఆ తర్వాత బ్రేక్‌లో ఇబ్బంది పడ్డారు. వేగం కూడా చాలా తగ్గింది’ అని తెలిపారు.