News October 8, 2024

16 వేల సమావేశాలు నిర్వహించిన RSS.. హరియాణా ఎన్నికల్లో కీ రోల్

image

హరియాణా ఎన్నికల్లో BJP అనూహ్యంగా పుంజుకోవడం వెనుక RSS కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గత 4 నెలల్లో క్షేత్ర‌స్థాయిలో 16 వేల‌కుపైగా స‌మావేశాలు నిర్వ‌హించింది. సంఘ్ కార్య‌క‌ర్త‌లు ఇంటింటి ప్ర‌చారం ద్వారా జాట్‌యేత‌ర ఓట్ల‌ను BJPకి చేరువ చేసినట్టు ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. పైగా అభ్య‌ర్థుల ఎంపిక‌లో BJP-RSS ఈసారి క‌లిసి ప‌నిచేశాయి. హిందూ స‌మాజం సంఘటితంపై మోహ‌న్ భాగ‌వ‌త్ పిలుపు ఫలితాన్నిచ్చింది.

Similar News

News March 29, 2026

రాబోయే 3 గంటల్లో వర్షం

image

రాబోయే 3 గంటల్లో ఏపీలోని గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, బాపట్ల, కడప, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక తెలంగాణలోని కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోనూ వచ్చే 2-3 గంటల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది?

News March 29, 2026

ఇలా చేస్తే మీ వెండి ఆభరణాలు మెరుస్తాయ్!

image

వెండి పట్టీలు, ఉంగరాలు, పూజా సామగ్రి తదితర వస్తువులు తరచూ నల్లగా మారుతుంటాయి. ఇంట్లో దొరికే పదార్థాలతోనే వాటిని మెరిసేలా చేయొచ్చు. బేకింగ్ సోడా, నీటిని కలిపి పేస్ట్‌లా చేసి బ్రెస్‌తో రుద్దితే కొత్తవాటిలా మెరుస్తాయి. ఇక వేడినీటిలో డిటర్జెంట్ పౌడర్ వేసి కాసేపు వెండి వస్తువులు అందులో ఉంచిన తర్వాత మృదువుగా రుద్దితే కొత్తరూపు వస్తుంది. ఉప్పు, టూత్ పేస్ట్‌‌నూ వాడి నల్ల వస్తువులను తెల్లగా మార్చుకోవచ్చు.

News March 29, 2026

పవర్‌ఫుల్ లీడర్స్: 13వ ప్లేస్‌లో CBN, 25వ ప్లేస్‌లో రేవంత్

image

దేశంలో శక్తిమంతమైన 100 మంది లీడర్ల లిస్ట్‌లో వరుసగా 12వ సారి మోదీ, అమిత్ షా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ‘AP CM CBN 13వ స్థానం, TG CM రేవంత్ 25వ ప్లేస్‌లో ఉన్నారు. పవన్ కళ్యాణ్(68), రామ్మోహన్ నాయుడు (90) కూడా చోటు దక్కించుకున్నారు’ అని Indian Express తెలిపింది. మరోవైపు అధికారంలో లేకపోవడంతో Ex CMలు KCR, జగన్‌ ఈ జాబితాలో లేరు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 9, ICC చీఫ్ జైషా 22వ స్థానంలో నిలిచారు.