News February 5, 2025
రాష్ట్రంలో ఆర్టీసీ బోర్డు ఏర్పాటు

AP: 17 మంది సభ్యులతో RTCకి బోర్డును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఛైర్మన్ కొనకళ్ల సహా ఆరుగురు సభ్యులు, 11 మంది అధికారులతో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. RTC ఎండీ, ఆర్థిక, రవాణా, జీఏడీ అధికారులు ఈ బోర్డులో భాగం కానున్నారు. ఆర్టీసీ బోర్డులో కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వహించేలా అధికారులను నియమించారు.
Similar News
News March 23, 2025
₹లక్ష దాటిన వెండి ఇన్వెస్టర్లకు సూపర్ ఛాన్స్: జిమీత్

జీవితకాల గరిష్ఠానికి చేరిన వెండి ఇన్వెస్టర్లకు సదవకాశం కల్పిస్తోందని శామ్కో వెంచర్స్ CEO జిమీత్ మోదీ అన్నారు. గరిష్ఠాన్ని బ్రేక్ చేసిన ప్రతిసారీ మంచి రాబడిని అందించిందని వివరించారు. 3, 6, 12 నెలల వ్యవధిలో 61, 62, 83% స్ట్రైక్ రేటుతో వరుసగా సగటున 21, 31, 28% రాబడి ఇచ్చిందన్నారు. కొవిడ్ టైమ్ మినహాయిస్తే Silver to Gold రేషియో 30 ఏళ్ల కనిష్ఠమైన 1.09% వద్ద ఉండటం బుల్లిష్‌నెస్‌ను సూచిస్తోందన్నారు.
News March 23, 2025
నటుడి సూసైడ్ కేసు: CBI సంచలన నిర్ణయం!

యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్‌కు సంబంధించి 2 కేసులను CBI మూసేసినట్టు తెలిసింది. అతడి మరణం వెనుక కుట్ర జరిగిందనడానికి ఆధారాలేమీ దొరకలేదని ముంబై కోర్టుకు రిపోర్టులు సమర్పించినట్టు సమాచారం. రియా చక్రబర్తి సహా కొందరు ఆర్థికంగా, మానసికంగా వేధించడంతోనే SSR చనిపోయాడని అతడి తండ్రి కేకే సింగ్ 2020, ఆగస్టులో FIR నమోదు చేయించారు. కాగా SSR మాజీ మేనేజర్ దిశ మృతి కేసు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది.
News March 22, 2025
కెప్టెన్సీకి హీథర్ నైట్ రాజీనామా

ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీకి హీథర్ నైట్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ECB ధ్రువీకరించింది. 9 ఏళ్లపాటు సేవలందించినందుకు థ్యాంక్స్ అని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 2016లో కెప్టెన్‌గా ఎంపికైన హీథర్ ఏకంగా 199 మ్యాచ్(టెస్టు, వన్డే, టీ20)లకు నాయకత్వం వహించారు. ఆమె సారథ్యంలోనే ఇంగ్లండ్ 2017 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. హీథర్ 3 ఫార్మాట్లలో 7వేలకు పైగా రన్స్, 84 వికెట్లు తీశారు.