News August 26, 2024
పోరాటానికి సిద్ధమైన RTC సిబ్బంది

TG: పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ RTC కార్మికులు పోరాటానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వంలో విలీనం పూర్తి చేయడం, 2 PRCలు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 27న ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 10న డిమాండ్స్ డే, అక్టోబర్ 1న HYD ఇందిరాపార్క్ వద్ద సామూహిక దీక్షలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
Similar News
News January 19, 2026
అన్నమయ్య: అవి కల్తీ బీర్లు కావు!

అన్నమయ్య జిల్లా KVపల్లె మండలం బండవడ్డిపల్లెకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మణికుమార్, పుష్పరాజ్ <<18888467>>బీర్లు తాగి మృతిచెందిన <<>>విషయం తెలిసిందే. ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు తాగిన బడ్వైజర్ టిన్ బీర్లు(బ్యాచ్ నం.046) గడువు లోపలవేనని స్పష్టం చేశారు. కల్తీ బీర్లు కాదని ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారించారు. అదే బీర్లు తాగిన మిగిలిన నలుగురు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించారు.
News January 19, 2026
గుడ్డుపై అపోహలు.. వైద్యులు ఏమన్నారంటే?

కొలెస్ట్రాల్ భయంతో గుడ్లు తినడం మానేశారా? అయితే ఈ విషయం మీ కోసమే. గుడ్లు తింటే రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందనే అపోహను శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. రోజుకు ఒకటి, రెండు గుడ్లు తిన్నా ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు లేదని పైగా శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు అందుతాయని డాక్టర్లు చెబుతున్నారు. గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం స్వల్పమేనని, సమతుల్య ఆహారంలో భాగంగా ఎగ్ తినాలని సూచిస్తున్నారు.
News January 19, 2026
బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఇలా చెయ్యండి

ప్రస్తుతకాలంలో మారిన జీవనశైలి వల్ల చాలామందిలో బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతోంది. దీనివల్ల డయాబెటిస్, హై బీపీ, గుండె జబ్బులు, లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువవుతాయంటున్నారు నిపుణులు. ఆహారంలో తెల్ల బియ్యం, మైదా, స్వీట్స్, జంక్ ఫుడ్ తగ్గించడం, ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవడం, క్రమంగా వ్యాయామం, మంచి నిద్ర ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ స్ట్రెస్ తగ్గించుకోవాలని చెబుతున్నారు.


