News August 26, 2024
పోరాటానికి సిద్ధమైన RTC సిబ్బంది
TG: పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ RTC కార్మికులు పోరాటానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వంలో విలీనం పూర్తి చేయడం, 2 PRCలు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 27న ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 10న డిమాండ్స్ డే, అక్టోబర్ 1న HYD ఇందిరాపార్క్ వద్ద సామూహిక దీక్షలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
Similar News
News September 15, 2024
ఏపీకి దివీస్ సంస్థ రూ.9.8 కోట్ల విరాళం
AP: వరద బాధితులను ఆదుకునేందుకు దివీస్ సంస్థ ముందుకొచ్చింది. మంత్రి లోకేశ్‌ను కలిసిన దివీస్ సీఈవో కిరణ్ CMRFకు రూ.5 కోట్ల చెక్కును అందించారు. దీంతో పాటు ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు వరద బాధితులకు ఆహారాన్ని అందించిన అక్షయపాత్ర ఫౌండేషన్‌కు మరో రూ.4.8 కోట్లను అందించారు. మొత్తంగా రూ.9.8 కోట్ల విరాళమిచ్చిన దివీస్ సంస్థను లోకేశ్ అభినందించారు.
News September 15, 2024
ఏఐ వల్ల ఉద్యోగాల కోత.. 67శాతం మంది ఇంజినీర్లలో టెన్షన్
కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయని 67.5శాతంమంది ఇంజినీర్లలో ఆందోళన నెలకొన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని గ్రేట్ లెర్నింగ్ సంస్థ తెలిపింది. నైపుణ్యాల్ని పెంచుకోకపోతే కెరీర్‌కు రక్షణ ఉండదని 87.5శాతం మంది అభిప్రాయపడ్డారని తెలిపింది. వచ్చే పదేళ్లలో 40శాతం వరకు జాబ్స్ ఏఐ పరిధిలోకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో 89శాతం మేర ఇంజినీర్లు AI, MLలోనే కొత్త నైపుణ్యాల్ని నేర్చుకోవాలనుకుంటున్నారని పేర్కొంది.
News September 15, 2024
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
హీరోయిన్ మేఘా ఆకాశ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు సాయి విష్ణుని పెళ్లాడారు. ఆదివారం చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వీరి పెళ్లి జరగ్గా పలు రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేశారు. శనివారం నిర్వహించిన రిసెప్షన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. లై, ఛల్ మోహన్ రంగా, పేట, కుట్టి స్టోరీ, డియర్ మేఘ, రాజ రాజ చోర వంటి చిత్రాల్లో మేఘా నటించారు.