News February 17, 2025
ఎన్నికల కోడ్ ముగిశాక ఆర్టీసీలో సమ్మె!

TG: తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సమ్మెకు దిగాలని TGSRTC కార్మిక సంఘాలు నిర్ణయించాయి. గత నెలలో <<15281267>>ఓ సమ్మె నోటీసు<<>> ఇవ్వగా, MLC ఎన్నికల కారణంగా యాజమాన్యంతో చర్చలు వాయిదా పడ్డాయి. కోడ్ ముగిసే వరకు గడువు ఇచ్చిన కార్మికులు త్వరలో మరో నోటీసు ఇవ్వాలని యోచిస్తున్నారు. తొలుత ఐదారు రోజులు సమ్మె చేసి, తర్వాత నిరవధిక సమ్మెకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అయితే సమ్మెపై సంఘాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు సమాచారం.
Similar News
News March 27, 2025
IPL బ్రాండ్ వాల్యూ రూ.లక్ష కోట్లు

ఇండియాలో అతిపెద్ద ఫ్రాంచైజీ ఈవెంట్ అయిన IPL బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగింది. 2009లో దాదాపు రూ.17 వేల కోట్ల బ్రాండ్ విలువ కలిగిన ఈ లీగ్ 2023లో తొలిసారి $10 బిలియన్లను తాకగా.. ఇప్పుడు $12 బిలియన్లకు చేరుకుంది. 2024లో 10 జట్ల సమష్టి బ్రాండ్ విలువ 13% పెరగడంతో ప్రస్తుతం $12 బిలియన్లకు చేరుకుందని TOI తెలిపింది. ఇందులో మీడియా రైట్సే రూ.48వేల కోట్లు కావడం గమనార్హం.
News March 27, 2025
మోహన్‌లాల్ ‘L2 ఎంపురాన్’ పబ్లిక్ టాక్

మోహన్ లాల్, పృథ్వీరాజ్ కాంబోలో తెరకెక్కిన ‘L2 ఎంపురాన్’ ప్రీమియర్ షో చూసిన అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఫస్ట్ హాఫ్ సాఫీగా సాగినా సెకండాఫ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌తో పాటు సీక్వెల్‌పై ఇచ్చే సర్‌ప్రైజ్ అదిరిపోయిందని పోస్టులు పెడుతున్నారు. మ్యూజిక్, ఫైట్స్ సినిమాకు హైలైట్ అంటున్నారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ.
News March 27, 2025
చాకలి ఐలమ్మ వర్సిటీకి యూజీసీ గుర్తింపు

TG: చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి యూజీసీ గుర్తింపు లభించింది. దీంతో విద్యార్థినుల సర్టిఫికెట్స్‌పై అధికారికంగా వర్సిటీ ముద్ర పడనుంది. అంతే కాకుండా వర్సిటీలో PhD చేయాలనుకునే విద్యార్థులకు మార్గం సుగమమైంది. అధికారులు సైతం త్వరలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వవిద్యాలయ గుర్తింపు లేకపోవడంతో ఇంతకాలం ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్టిఫికెట్స్ వచ్చేవి.