News April 11, 2024
రాజ్యాలను శాసించారు.. ఇప్పుడు రాష్ట్రం కావాలంటున్నారు! – 2/3

సత్యయుగంలో ఇంద్రాపూర్ (ప్రస్తుతం అస్సాంలోని ధుబ్రీ) తమ రాజ్య రాజధాని అని ఈ వర్గానికి చెందిన మహారాజ అనంత్ రాయ్ చెప్పుకొచ్చారు. త్రేతాయుగంలో బిహార్‌లోని మిథిలాపురిని, కలియుగంలో కామ్తా రాజ్యాన్ని పాలించామని తెలిపారు. ఈ కామ్తానే ఇప్పటి బెంగాల్‌లోని కూచ్ బెహార్. స్వాతంత్ర్యం అనంతరం వీరి ప్రాంతాన్ని ఓ జిల్లాగా మార్చి బెంగాల్‌లో కలిపేశారు. ఇది అక్రమం, రాజ్యాంగ విరుధ్ధం అనేది వీరి వాదన. <<-se>>#Elections2024<<>>
Similar News
News March 16, 2026
W.బెంగాల్.. 144 మంది అభ్యర్థులను ప్రకటించిన BJP

WB అసెంబ్లీ ఎన్నికల వేళ BJP 144 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్థానమైన భవానీపూర్ నుంచి ప్రతిపక్షనేత సువేందు అధికారిని బరిలో దించింది. నందిగ్రామ్‌లోనూ ఆయనే పోటీ చేస్తున్నారు. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో APR 23, 29వ తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అటు కేరళంలోనూ 47 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితాను BJP ప్రకటించింది.
News March 16, 2026
శుక్రుడు మరీ ఇంత స్లోనా?

సౌర కుటుంబంలో అత్యంత వింతైన గ్రహం శుక్రుడు. సాధారణంగా గ్రహాలకు తమ చుట్టూ తాము తిరగడానికి పట్టే సమయం(రోజు) కంటే, సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే సమయం (సంవత్సరం) ఎక్కువ. కానీ శుక్ర గ్రహం తన చుట్టూ తాను నెమ్మదిగా తిరుగుతుంది. అందుకే అక్కడ ఒక రోజు(243d) గడవకముందే ఒక సంవత్సరం(225d) పూర్తవుతుంది. ఈ కాలగమనం ఖగోళ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో
News March 16, 2026
ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రచారం.. పరువు నష్టం దావా వేసిన కేంద్ర మంత్రి కూతురు

కేంద్ర మంత్రి హర్దీప్ పూరీ కూతురు హిమాయని ఢిల్లీ హైకోర్టులో ₹10Crకు పరువు నష్టం దావా వేశారు. US లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్ ఫైల్స్‌తో తనకు సంబంధం ఉన్నట్లు కొందరు SMలో తప్పుడు ప్రచారం చేశారని ఆమె పేర్కొన్నారు. ఆ కంటెంట్‌ను తొలగించాలని కోరారు. కాగా ఎప్‌స్టీన్‌తో హర్దీప్ పూరీకి సంబంధాలున్నట్లు 2014-15 మధ్య విమర్శలు రాగా ఆయన ఖండించారు.


