News July 17, 2024
హార్దిక్‌తో విడాకుల రూమర్స్.. సెర్బియా వెళ్లిపోయిన నటాషా?

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య భార్య నటాషా స్వదేశం సెర్బియా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కుమారుడు అగస్త్యతో కలిసి ఆమె కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతకుముందు ఇన్‌స్టాలో ‘ఆ సమయం వచ్చింది’ అనే అర్థం వచ్చేలా నటాషా ఓ పోస్ట్ పెట్టారు. విమానం, ఇంటి ఎమోజీలను షేర్ చేయడంతో సెర్బియా వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 30, 2025
రాత్రికిరాత్రే ఢాకాకు బంగ్లా రాయబారి.. ఏం జరుగుతోంది?

భారత్‌లోని బంగ్లాదేశ్ హైకమిషనర్ రియాజ్ హమీదుల్లా ఢాకా నుంచి వచ్చిన అత్యవసర ఆదేశాలతో సోమవారం రాత్రి హుటాహుటిన స్వదేశానికి చేరుకున్నారు. ఉస్మాన్ హాదీ హత్య నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత వివాదాస్పద పరిస్థితులపై చర్చించేందుకే విదేశాంగ శాఖ ఆయన్ను పిలిపించినట్లు ‘ప్రథమ్ ఆలో’ పత్రిక వెల్లడించింది. ఈ ఆకస్మిక పరిణామం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
News December 30, 2025
థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకున్నాక ఎప్పుడు ఫుడ్ తీసుకోవాలంటే?

థైరాయిడ్ మందులను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ తర్వాత యాభై నిమిషాల తర్వాత ఫుడ్ తీసుకోవాలని చెబుతున్నారు. అప్పుడే శరీరం మందును బాగా గ్రహిస్తుంది. అలాగే థైరాయిడ్ టాబ్లెట్లు వేసుకున్న గంట వరకు థైరాయిడ్ మందుల శోషణకు అంతరాయం కలిగించే యాంటాసిడ్లు, ఇతర మందులను వేసుకోవడం, ఫైబర్, కాల్షియం, ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు తినడం మానుకోవాలని సూచిస్తున్నారు.
News December 30, 2025
451 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

త్రివిధ దళాల్లో 451 ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. UPSC కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2026 ద్వారా వీటిని భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్ డిగ్రీ, డిగ్రీ ఉత్తీర్ణులై, 20 -24ఏళ్ల మధ్య వయసు గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.200, SC, ST, మహిళలకు ఫీజు లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://upsconline.nic.in.


