News December 19, 2024
జీవితకాల కనిష్ఠ స్థాయికి రూపాయి

రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రాత్మక కనిష్ఠ స్థాయి రూ.85కు చేరుకుంది. దేశీయంగా వస్తు, సేవల దిగుమతికి $ అవసరాలు పెరిగాయి. పోర్ట్‌ఫోలియో అడ్జస్ట్మెంట్ వంటి వాటికోసం విదేశీ బ్యాంకులు పెద్ద ఎత్తున డాలర్‌ను పోగేస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఔట్ఫ్లోతో దేశీయ ఈక్విటీ మార్కెట్ నష్టాల్లో పయనిస్తోంది. ఈ కారణల వల్ల డాలర్ బలపడుతుండడంతో రూపాయి విలువ తగ్గిపోతోంది.
Similar News
News January 5, 2026
శివ మానస పూజ ఎలా చేయాలి?

శివ మానస పూజ అంటే ఏ పూజా సామాగ్రి లేకుండా మనసులోనే పరమశివుడిని ఆరాధించడం. అందుకోసం ప్రశాంతమైన చోట కూర్చుని కళ్లు మూసుకోవాలి. హృదయమే రత్న సింహాసనమని, ఆత్మయే శివుడని భావించాలి. మనసులోనే గంగాజలంతో అభిషేకం, కల్పవృక్ష పుష్పాలతో అలంకరణ, ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. పంచేంద్రియాలను శివుడికి అంకితం చేయాలి. ఈ మానసిక అర్చన అత్యంత శక్తిమంతమైనది. భౌతిక పూజా ద్రవ్యాలు అందుబాటులో లేకపోతే ఈ పూజను ఆచరించవచ్చు.
News January 5, 2026
కాండం తొలిచే పురుగుతో వరికి నష్టం ఎక్కువే..

కాండం తొలిచే పురుగు వరి నారుమడి నుంచి పంట ఈనె దశ వరకు ఆశించి నష్టం కలిగిస్తుంది. నారుమడి దశలో ఈ పురుగు మొక్క మువ్వలోకి రంద్రాలు చేసుకొని చొచ్చుకెళ్లి తినడం వల్ల మువ్వ గోధుమ రంగులోకి మారి మెలికలు తిరిగి ఎండి, మొక్కలు అధికంగా చనిపోతాయి. కాండం భాగాన్ని ఈ పురుగు తింటే మొక్కకు సరిపడ పోషకాలు అందక తెల్లకంకిగా మారి తాలు గింజలు ఏర్పడతాయి. కాండం తొలుచు పురుగు పంట నాణ్యత, దిగుబడిని ప్రభావితం చేస్తుంది.
News January 5, 2026
కోమా నుంచి బయటపడ్డ మార్టిన్

కోమాలోకి వెళ్లిన AUS మాజీ క్రికెటర్ <<18721780>>మార్టిన్<<>> అందులో నుంచి బయటపడ్డారని మాజీ వికెట్ కీపర్ గిల్‌క్రిస్ట్ వెల్లడించారు. ‘గత 48 గంటల్లో అద్భుతం జరిగింది. అతడు చికిత్సకు స్పందిస్తున్నాడు. మాట్లాడగలుగుతున్నాడు. అతడిని ICU నుంచి వేరే వార్డుకి మార్చవచ్చు. ఇది ఒక పాజిటివ్ విషయం. అతడికి ఇంకొంతకాలం ఆస్పత్రిలోనే చికిత్స కొనసాగుతుంది’ అని పేర్కొన్నారు. మార్టిన్ Meningitis అనే వ్యాధితో బాధపడుతున్నారు.


