News February 3, 2025
చరిత్ర సృష్టించిన రసెల్

వెస్టిండీస్ ప్లేయర్ రసెల్ టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ ఫార్మాట్లో అత్యంత వేగంగా 9వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్గా నిలిచారు. ఆయన కేవలం 5,321 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నారు. అంతకుముందు ఈ రికార్డు మ్యాక్స్ వెల్(5,915 బంతులు) పేరిట ఉండేది. ఓవరాల్గా 9వేల పరుగులు పూర్తి చేసిన 25వ ప్లేయర్ రసెల్ కావడం గమనార్హం. 536 మ్యాచుల్లో 9,004 పరుగులు చేశారు.
Similar News
News December 6, 2025
ఆడపిల్ల పుడితే రూ.10,000.. పండుగకు రూ.20,000!

TG: పంచాయతీ ఎన్నికల వేళ సర్పంచ్ అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. సిరిసిల్ల(D) ఆరేపల్లిలో ఓ అభ్యర్థి ఎవరికైనా ఆడపిల్ల జన్మిస్తే ఆమె పేరిట రూ.10వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు మెదక్(D) కాప్రాయిపల్లిలో ఓ అభ్యర్థి ఏకంగా 15 హామీలను బాండ్ పేపర్పై రాసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అందులో ఆడపిల్ల పుడితే ₹2వేలు, తీజ్ పండుగకు ₹20వేలు, అంత్యక్రియలకు ₹5వేలు వంటి హామీలున్నాయి.
News December 6, 2025
శభాష్.. తల్లికి పునర్జన్మనిచ్చాడు

AP: విద్యుత్ షాక్తో కొట్టుమిట్టాడుతున్న తల్లి ప్రాణాలను సమయస్ఫూర్తితో కాపాడుకున్నాడో ఐదో తరగతి బాలుడు. ఈ ఘటన ప.గో(D) జొన్నలగరువులో జరిగింది. నిన్న మెగా PTMకు వస్తానన్న తల్లి ఎంతకీ రాకపోవడంతో కొడుకు దీక్షిత్ ఇంటికి వెళ్లగా ఆమె కరెంట్ షాక్తో విలవిల్లాడుతూ కనిపించింది. కొడుకు భయపడకుండా స్విచ్ ఆఫ్ చేసి, కరెంటు తీగను తీసేసి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. దీంతో పిల్లాడి ధైర్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.
News December 6, 2025
రూపాయి తన స్థాయిని తానే కనుగొంటుంది: నిర్మల

రూపాయి పతనంపై కేంద్ర మంత్రి నిర్మల స్పందించారు. రూపాయి తన స్థాయిని తానే కనుగొంటుందని అన్నారు. ఈ పతనం ప్రతికూలం కాదని, ఎగుమతిదారులకు ప్రయోజనకరమని చెప్పారు. ‘రూపాయి, కరెన్సీ ఎక్స్ఛేంజ్ రేట్ల వంటివి చాలా సెన్సిటివ్ అంశాలు. మేం ప్రతిపక్షంలో ఉండగా నిరసనలు చేశాం. కానీ అప్పట్లో ద్రవ్యోల్బణం ఎక్కువగా, ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండేది. ఇప్పుడు ఎకానమీ ఏ పొజిషన్లో ఉందో చూడండి’ అని HT సమ్మిట్లో అన్నారు.


