News November 12, 2024

శత్రుదాడి జరిగితే పరస్పర రక్షణకు రష్యా, నార్త్ కొరియా డీల్

image

శత్రుదేశాలు యుద్ధానికి వస్తే ఒకరికొకరు సహాయంగా నిలబడేలా రష్యా, ఉత్తర కొరియా ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఈ ఒప్పందం జరిగినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. రెండు దేశాల మధ్య సహకారం ఇటీవల బాగా పెరిగిన సంగతి తెలిసిందే. ప్యాంగ్యాంగ్‌కు రష్యా ఆయుధ సాంకేతికత సరఫరా చేస్తుండగా అటు కిమ్ జాంగ్ వేలాదిమంది సైనికుల్ని ఉక్రెయిన్‌తో యుద్ధం కోసం రష్యాకు సరఫరా చేస్తున్నారు.

Similar News

News December 13, 2024

జడ్జిలు ఫేస్‌బుక్‌లో కామెంట్స్ చేయొద్దు: సుప్రీంకోర్టు

image

ఫేస్‌బుక్ సహా సోషల్ మీడియాకు జడ్జిలు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. వారు రుషుల్లా జీవిస్తూ గుర్రాల్లాగా పనిచేయాలని, తీర్పులపై కామెంట్లు చేయొద్దని జస్టిస్‌లు నాగరత్న, కోటీశ్వర్ సింగ్ బెంచ్ పేర్కొంది. అలాచేస్తే భవిష్యత్తు విచారణల్లో ఆ తీర్పులను కోట్ చేయాల్సొస్తే ఇబ్బంది తప్పదని వెల్లడించింది. MP హైకోర్టు ఇద్దరు ప్రొబేషనరీ మహిళా న్యాయాధికారుల టర్మినేషన్ కేసు విచారణలో ఇలా వ్యాఖ్యానించింది.

News December 13, 2024

BIGGEST BREAKING: అల్లు అర్జున్ అరెస్ట్

image

TG: హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో ఆయనను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అర్జున్‌ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులోనే అర్జున్‌ను అరెస్ట్ చేశారు.

News December 13, 2024

భార్యాబాధితుడి సూసైడ్: భార్య ఆఫీస్ ముందు మగాళ్ల ఆందోళన

image

భార్యాబాధితుడు అతుల్ <<14841616>>సూసైడ్<<>> నిశ్శబ్ద విప్లవం సృష్టిస్తోంది! ‘జస్టిస్ ఫర్ అతుల్ సుభాష్’ అంటూ మగవాళ్లు నినదిస్తున్నారు. బెంగళూరులో అతడి భార్య నికిత పనిచేసే అసెంచర్ ఆఫీస్ ముందు వందలాది IT ఉద్యోగులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. హైదరాబాద్, కోల్‌కతా అసెంచర్ ఆఫీసులు, ఢిల్లీ జంతర్ మంతర్‌ వద్దకు టెకీలు రావాలని పిలుపునిస్తూ అక్కడక్కడా పోస్టర్లు వెలిశాయి. జెండర్ న్యూట్రల్ చట్టాల కోసం డిమాండ్లు పెరిగాయి.